CP Anjani kumar (Photo-Twitter)

Hyd, Dec 30: నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions in Hyderabad) ప్రకటించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 2 గంటల వరకు ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు పరిసరాల్లో వాహనాల రాకపోకలను అనుమతించబోమని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ (Hyderabad Commissioner of Police Anjani Kumar) తెలిపారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు తప్ప మిగితా వాహనాలకు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి1 ఉదయం 5గంటల వరకు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లై ఓవర్ రూట్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు.

ఇక రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు.. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్లు(1, 2), మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్‌టీయూ ఫ్లైఓవర్, రోడ్డు నెం. 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు వంతెన, బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ (బాలానగర్) మూసివేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.

డిసెంబర్ 31న విధుల్లో ఉండే క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు విధుల్లో యూనిఫామ్‌లో ఉండి అన్ని వాహన డాక్యుమెంట్లు కలిగి ఉండాలన్నారు. క్యాబ్ డ్రైవర్లు రైడ్‌కు అనుమతి నిరాకరిస్తే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే క్యాబ్ ఆటో ఓనర్లపై మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 కింద రూ.500 పెనాల్టీ విధిస్తామని చెప్పారు. పబ్లిక్ వద్ద అధిక డబ్బు డిమాండ్ చేస్తూ మిస్‌బిహేవ్ చేయవద్దని అన్నారు.

జనవరి 2 వరకు తెలంగాణలో ఆంక్షలు, ర్యాలీలు, సభలను నిషేధిస్తున్నామని తెలిపిన డీజీపీ మహేందర్ రెడ్డి, అందరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు

పబ్‌లో తాగి బయటకి వెళ్లే కస్టమర్ తాగి వాహనం నడపకుండా పబ్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. అడుగడుగున డ్రంకన్ అండ్‌ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోతే వాహనాలు జప్తు కూడా చేస్తామని తెలిపారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడిపితే డ్రైవర్, వాహన యజమాని ఇద్దరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. వాహన నంబర్ ప్లేటులు లేకుండా, వాహనంలో అధిక శబ్ధాలతో ప్రయాణిస్తే బండి సీజ్ చేస్తామన్నారు.

వాహనాల్లో అధిక జనాభా, వాహనం మీద కూర్చోని ప్రయాణించడం, పబ్లిక్ స్థలంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగి వాహనం నడిపితే మొదటిసారి దొరికితే రూ.10వేల జరిమాన‌ లేదా ఆరు నెలల జైలు శిక్ష, రెండో సారి పట్టుబడితే రూ.15 ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఖైరతాబాద్ మార్కెట్ నుండి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ (బడా గణేష్) వద్ద సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్ మరియు లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు, సచివాలయం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్ లేన్ సాధారణ ట్రాఫిక్ కోసం మూసివేయబడుతుంది. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాల రాకపోకలను సంజీవయ్య పార్కు, నెక్లెస్‌ రోడ్డు వైపు అనుమతించకుండా కర్బలా మైదాన్‌ లేదా మినిస్టర్స్‌ రోడ్డు వైపు మళ్లించి, సికింద్రాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికులను సెయిలింగ్‌ క్లబ్‌ వద్ద కవాడిగూడ క్రాస్‌రోడ్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ దేవాలయం వైపు మళ్లిస్తారు.

కరోనా థర్డ్‌వేవ్‌ దూసుకొస్తోంది, తెలంగాణలో వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని తెలిపిన రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచన

బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్నిఫ్లైఓవర్లు గురువారం సాయంత్రం మరుసటి రోజు వరకు మూసివేయబడతాయి” అని కమిషనర్ తెలిపారు, శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల వరకు హైదరాబాద్ నగర పరిధిలో ప్రైవేట్ బస్సులు, లారీలు మరియు భారీ వాహనాలను అనుమతించబోమని కమిషనర్ తెలిపారు.

.

రిసార్ట్‌లు, పార్కులు, హోటళ్లు, బార్‌లు, పబ్బులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను ఆంక్షలు విధించినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ ఎం. భగవత్‌ తెలిపారు. COVID-19 మహమ్మారి దృష్ట్యా ఇంట్లోనే ఉండాలని మరియు వారి కదలికలను పరిమితం చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. 11 గంటల నుంచి తేలికపాటి మోటారు వాహనాలు మరియు ఓఆర్‌ఆర్‌పై ప్రయాణీకుల వాహనాల రాకపోకలపై నియంత్రణ ఉంటుందని భగవత్ తెలిపారు. గురువారం నుండి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు. అయితే, మధ్యస్థ మరియు భారీ వాహనాలు ORRలో అనుమతించబడతాయి.