Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమిదే! (వీడియోతో)

మరో వారంలో ప్రారంభించాలనుకొన్న తెలంగాణ నూతన సచివాలయం (Telangana New Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ (Election Code) కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమిదే! (వీడియోతో)
Telangana New Secretariat (Photo-TS CMO)

Hyderabad, Feb 11: మరో వారంలో ప్రారంభించాలనుకొన్న తెలంగాణ నూతన సచివాలయం (Telangana New Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ (CM KCR) పుట్టినరోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ నిర్మాణాన్ని రాకెట్ వేగంతో పూర్తి చేస్తున్నది. అయితే ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రానే వచ్చేసింది.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సోమవారం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అంగప్రదక్షిణం టికెట్లు నేటి నుంచే అందుబాటులోకి..

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రారంభోత్సవానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

ఇదేందయ్యా.. ఇది?? మంత్రిపై దురద పుట్టించే పౌడర్ చల్లడమా?? మధ్యప్రదేశ్ లో నవ్వుతెప్పిస్తున్న ఘటన.. వీడియో ఇదిగో!

 

(The above story first appeared on LatestLY on Feb 11, 2023 09:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).