Credits: Video Grab

Bhopal, Feb 11: తమకు కావాల్సిన పనులు చేయని ప్రజాప్రతినిధులపై ఇంకు (Ink) దాడి చేయడం చూశాం. అయితే, మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో ఓ మంత్రిపై జరిగిన విచిత్ర దాడి నవ్వులు పూయిస్తుంది. విషయమేంటంటే.. భోపాల్ (Bhopal) లో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ (Brijendra Singh Yadav) కూడా పాల్గొన్నారు. రథయాత్ర సాగుతుండగా ఓ వ్యక్తి మంత్రిని లక్ష్యంగా చేసుకుని దురద పుట్టించే పౌడర్ చల్లాడు.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సోమవారం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అంగప్రదక్షిణం టికెట్లు నేటి నుంచే అందుబాటులోకి..

దాంతో, మంత్రి గోక్కోవడం.. అనంతరం కడుక్కోవడం మొదలుపెట్టారు. తన దురద బాధను అక్కడున్నవారికి నవ్వుతూ వివరించగా, వారు కూడా ఆయనతో కలిసి నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.