Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 1478 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 42,496కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 400 దాటిన కరోనా మరణాలు

కరీంనగర్ జిల్లాలో కరోనావైరస్ తీవ్రత ఎక్కువవుతోంది. ఇటీవల కాలంలో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 90కి పైగా కేసులు నమోదు కాగా, ఈరోజు కూడా 77 మందికి పాజిటివ్ అని తేలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో...

Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 1478 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 42,496కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 400 దాటిన కరోనా మరణాలు
Coronavirus infection | Image used for representational purpose (Photo Credits: Pixarby)

Hyderabad, July 17:  తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గడం లేదు, నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే నమోదవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు ఇప్పుడు జిల్లాలకూ వ్యాపించింది. గత వారం రోజులుగా జిల్లాల నుంచి కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 1478 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో  రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 42,496 కి చేరుకుంది.

శుక్రవారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 806 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  నగరానికి సమీపంలో ఉండే రంగారెడ్డి జిల్లా నుంచి 91 కేసులు, మేడ్చల్ నుంచి 82, సంగారెడ్డి నుంచి 20 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.

Telangana's COVID Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఇక కరీంనగర్ జిల్లాలో కరోనావైరస్ తీవ్రత ఎక్కువవుతోంది. ఇటీవల కాలంలో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 90కి పైగా కేసులు నమోదు కాగా, ఈరోజు కూడా 77 మందికి పాజిటివ్ అని తేలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కేసులను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు పెద్దపల్లి నుంచి 35, సిరిసిల్ల నుంచి 27, జగిత్యాలలో 4 కేసులు వచ్చాయి. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  ఈ ఒక్కరోజే 140కి పైగానే కేసులు నమోదయ్యాయి. కొవిడ్ విషయంలో ఆందోళన వద్దు, అందరికీ వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధం: సీఎం కేసీఆర్

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 7 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 403 కు పెరిగింది.

అలాగే, శుక్రవారం సాయంత్రం వరకు మరో 1410 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 28,705 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,389 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో  15,124 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,37817 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jul 17, 2020 10:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).