Telangana Shocker: ప్రేమించుకున్నారు, ఒకే తాడుకు ఉరి వేసుకున్నారు, కులాల వేరు కావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని బలవన్మరణానికి పాల్పడిన ప్రేమజంట

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Suicide (Photo Credits: Twitter)

హైదరాబాద్, జూలె 12: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో నేహా ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. అదే కాలేజీలో లచ్చపేటకు చెందిన భగీరథ్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం భగీరథ్‌కు చెందిన ఓ ఇంట్లో ఇద్దరూ ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గుర్తించిన భగీరథ్‌ కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ విద్యార్థినిని కొట్టిన టీచర్, మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్

ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను దుబ్బాక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ఓ లేఖ లభ్యమైనట్లు సమాచారం. కాగా, తమ కులాలు వేరుకావడంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించరని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు.. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement