Representational Image (Photo Credits: ANI)

Hyd, July 21: హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వ్యూస్ రావడం లేదని సైదాబాద్‌ క్రాంతినగర్‌లో యూట్యూబర్‌ ఆత్మహత్యకు ( Youtuber ends life) పాల్పడ్డాడు. యూట్యూబ్‌లో వ్యూస్‌ పెరగడం లేదంటూ (not getting views) డ్రిపెషన్‌తో డీనా అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖ కూడా రాశాడు. మృతుడు ఐఐటీ గ్వాలియర్‌లో డీనా ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. గేమ్‌ ఆడుతూ తన బాధను చెప్పుకున్న డీనా.. ఆ క్రమంలో ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

తను రాసిన సూసైడ్ నోట్ లో ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాడు. కాగా అతను యూట్యూబ్‌లో selflo గేమ్‌ ఛానెల్‌ను అతను నిర్వహిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ ఛానెల్‌కు ఎక్కువ మంది వీక్షకులు రావడం లేదని ఆయన వాపోయారు. గురువారం ఉదయం యూట్యూబ్ లైవ్‌లో గేమ్ ఆడిన దీనా.. తన బాధను వీక్షకులకు చెబుతూనే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

శాడిస్ట్ భర్త.. భార్యను కరెంట్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టాడు, వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కారణం

ఆత్మహత్యకు 8 గంటల ముందే సూసైడ్ లెటర్‌ను డీనా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. డీనా తండ్రి తమిళనాడుకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి రైల్వేలో తల్లి డీఆర్‌డీవోలో పనిచేస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.