ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ వ్యక్తి తన భార్యను స్తంభానికి కట్టేసి కొట్టిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగ్రా లోని అర్సేనా గ్రామానికి చెందిన కుసుమా దేవి, శ్యామ్‌ బీహారి భార్యా భర్తల మధ్య గతకొంతకాలంగా గొడవ జరుగుతున్నది. ఈ క్రమంలో అతడు కుసుమా దేవిని చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. విషయం పోలీసులకు చెప్పొంద్దని భర్త, అత్త.. ఆమెను హెచ్చరించారు. అయితే విసిగి వేసారిన ఆమె విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే అది తెలుసుకున్న శ్యామ్‌ బీహారి.. ఈ నెల 14న ఆమెను రోడ్డుపై స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టాడు. దీన్నంతా పొరుగువారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)