RTS Bus Stolen: ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడూ చూడాలే.. ఆర్టీసీ బస్సు చోరీ చేసి డ్రైవర్‌ అవతారమెత్తిన దొంగ.. ప్రయాణికులు టిక్కెట్లకు ఇచ్చిన డబ్బుతో పరార్.. సిరిసిల్ల జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఘటన..

ఇదో విచిత్ర ఘటన. ఆర్టీసీ బస్సును చోరీ చేసిన ఓ దొంగ ఏకంగా డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. అంతటితో ఆగకుండా ప్రయాణికుల నుంచి టిక్కెట్ల పేరిట డబ్బులు వసూలు చేసి పారిపోయాడు.

RTS Bus Stolen: ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడూ చూడాలే..  ఆర్టీసీ బస్సు చోరీ చేసి డ్రైవర్‌ అవతారమెత్తిన దొంగ.. ప్రయాణికులు టిక్కెట్లకు ఇచ్చిన డబ్బుతో పరార్.. సిరిసిల్ల జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఘటన..
Credits: X

Siddipet, Sep 12: ఇదో విచిత్ర ఘటన. ఆర్టీసీ బస్సు(RTC Bus)ను చోరీ చేసిన ఓ దొంగ (Thief) ఏకంగా డ్రైవర్‌ (Driver) అవతారం ఎత్తాడు. అంతటితో ఆగకుండా  ప్రయాణికుల నుంచి టిక్కెట్ల (Tickets) పేరిట డబ్బులు వసూలు చేసి పారిపోయాడు. సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి తన బస్సును ఆర్టీసీలో అద్దెకు నడిపిస్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి బస్సు డ్రైవర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద దాన్ని పార్క్‌ చేసి తాళం వేయకుండానే వెళ్లిపోయారు. ఇదే అదనుగా జిల్లాలోని గంభీరావు పేట మండలం శ్రీగాదకు చెందిన బందెల రాజు బస్సును దొంగిలించి డ్రైవ్ చేస్తూ వేములవాడకు బయలుదేరాడు. మార్గమధ్యంలో కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని వారి వద్ద టిక్కెట్ల పేరిట డబ్బులు కూడా వసూలు చేశాడు. టిక్కెట్లు మాత్రం తరువాత ఇస్తానని అన్నాడు. ఆర్టీసీ బస్సు కావడంతో ప్రయాణికులు అతడి తీరును అనుమానించలేదు. ఈ లోపు సారంపల్లి-నేరెళ్ల మార్గంలో బస్సు తంగళపల్లి వద్ద ఆగిపోయింది. దీంతో, డీజిల్ అయిపోయిందని, తీసుకొస్తానని చెప్పిన దొంగ పరారయ్యాడు.

Asia Cup India vs Pakistan: పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం, 228 పరుగుల తేడాతో పాక్‌పై భారత్ గెలుపు..

బయటపడింది ఇలా..

అటుగా వెళుతున్న ఇతర ఆర్టీసీ బస్సు డ్రైవర్లు రోడ్డు మీద ఆగున్న బస్సును గమనించి కంట్రోలర్‌ కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని కంట్రోలర్ బస్సు యజమానికి సమాచారం ఇవ్వగా ఆయన వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, సిద్దిపేట పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ప్రయాణికులు తీసిన ఫోటోల ఆధారంగా నిందితుడు రాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు నోరెళ్లబెట్టారు.

Asia Cup 2023: వీడియో ఇదిగో, చాలా కాలం తర్వాత బుమ్రా ఖాతాలో వికెట్, వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌

(The above story first appeared on LatestLY on Sep 12, 2023 08:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).