వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. సూపర్-4 దశలో రిజర్వ్ డే అయిన సోమవారం నాటి మ్యాచ్‌లో బుమ్రా మైదానంలో దిగాడు.ఈ క్రమంలో 14 బంతుల తర్వాత.. వికెట్ పడగొట్టాడు. 357 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను బుమ్రా అవుట్ చేశాడు. అద్భుతంగా స్వింగ్ అయిన ఈ బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ ఇమామ్.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ తొలి వికెట్ కోల్పోగా.. చాలా కాలం తర్వాత వన్డే క్రికెట్‌లో బుమ్రా ఖాతాలో వికెట్ వచ్చి చేరింది.
Here's Video
BOOM BOOM BUMRAH! 💥
Ball in hand for the first time this tournament, @Jaspritbumrah93 takes no time to make an impact! 😍#TeamIndia get their opening wicket.
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/GWnLcI8oWv
— Star Sports (@StarSportsIndia) September 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)