TS SSC Exam Date 2024 Out: తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు పదో తరగతి పరీక్షలు, పూర్తి వివరాలు ఇవిగో..
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
Telangana SSC Exam Time Table 2024: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది ఫిజికల్ సైన్స్, బయాలజీ రెండు సబ్జెక్టులకు వేరు వేరుగా పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు సబ్జెక్ట్‌లకు ఉదయం 9.30 నుంచి ఉదయం 11.30 వరకు మాత్రమే పరీక్ష నిర్వహించననున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 8 వేల 385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతరత్రా పేపర్లకు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్ధుల హాల్ టికెట్స్ పాఠశాలలకు చేరుకున్నాయి. bse.Telangana.gov.in లో కూడా హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 40 రోజుల ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. తెలంగాణలో ఈసారి పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత శాతం తీసుకురావాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18న ప్రథమ భాషా పరీక్ష, మార్చి 19న ద్వితీయ భాషా పరీక్ష, మార్చి 21న తృతీయ భాషా పరీక్ష, 23న గణితం, 26న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్, 30న సోషల్ సైన్స్, ఏప్రిల్ 1, 4 తేదీలలో సంస్కృతం, అరబిక్. అయితే ఈ ఏడాది ఫిజికల్ సైన్స్, బయాలజీ రెండు సబ్జెక్టులకు వేరు వేరుగా పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షలకు హాజరయ్యే సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. 10వ తరగతి విద్యార్థులు నిర్ధారిత సమయానికి హాజరు కావాలని, ఆలస్యం కాకుండా చూసుకోవాలని అధికారులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Mar 07, 2024 06:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

