Hyd, Mar 7: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని (MLCs Appointment) తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు (Telangana HC quashes rejection order) కొట్టివేసింది. కాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన ఈ గెజిట్‌ను ఉన్నత న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. 2024 నుంచి 2034 దాకా తెలంగాణలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే, మా జోలికి వస్తే అంతు చూస్తామని పాలమూరు ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. దాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో కోర్టు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. సిఫార్సుల తిరస్కరణలో గవర్నర్ తమిళిసై తీరును హైకోర్టు తప్పు పట్టింది. వీరి ఎన్నికను పున:పరిశీలించాలని గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా.. తిరిగి పంపించాల్సిందని కోర్టు అభిప్రాయపడింది.మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. ఇక, మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని కోర్టు తెలిపింది.