Palamuru, Mar 6: మహబూబ్ నగర్‌లో పాలమూరు ప్రజాదీవెన సభలో (Congress Praja Deevena Sabha) సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరా? 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) ప్రశ్నించారు.
తమ ప్రభుత్వాన్ని కూలదోసే దమ్ము ఎవరికీ లేదన్నారు. పదేళ్లు పాలించిన వారు రెండు నెలలకో ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారని మండిపడ్డారు. ఎవరైనా తోక జాడిస్తే కత్తిరించే కత్తెర తన చేతిలోనే ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడమే బీఆర్ఎస్ విధానమా? అని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి మంచిది కాదన్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫా ద్వారా అన్నదాతల సమస్యలు పరిష్కారం, రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
అతిథి మన వద్దకు వస్తే గౌరవించాలని.. ప్రధాని సభకు వెళ్లానని పేర్కొన్నారు. భవిష్యత్తులో సహకారం అందించకపోతే చాకిరేవుపెడతానని అన్నారు. బీఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా సమితి విమర్శించిన సీఎం.. పదేళ్లలో తెలంగాణను లూటీ చేశారని మండిపడ్డారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయలేదు కానీ మందువేసుకొని ఫామ్ హౌజ్‌లో ఉన్నావని కేసీఆర్‌ను ఉద్ధేశించి మండిపడ్డారు. గద్వాలు నీళ్లు తెస్తామన్న కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చిందా అని నిలదీశారు.
Here's CM Revanth Reddy Speech Videos
వలస వచ్చిన ఆ బేకర్ గాన్ని...
పాలమూరు నుంచి ఎంపీగా పంపినం.
-- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి#PalamuruPrajaDeevenaSabha #RevanthReddy @revanth_anumula pic.twitter.com/bDV4UY5pRC
— Congress for Telangana (@Congress4TS) March 6, 2024
ప్రభుత్వం కులిపోతుందన్న కామెంట్స్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం
కొడకల్లారా... మా ప్రభుత్వన్ని టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కనికలై, మానవ బాంబులై ఎవడన్నా మిగిలితే చూస్తా...
👉 ప్రభుత్వం జోలికి వస్తె ఒక్కొకన్ని పండ బెట్టి తొక్కి పేగులు తీసి మెడల వేసుకొని ఊరేగుతాం.… pic.twitter.com/Ln65mdCwcN
— Congress for Telangana (@Congress4TS) March 6, 2024
BRS = Billa Ranga Samiti
B - బిల్లా
R- రంగా
S - సమితి#PalamuruPrajaDeevenaSabha #RevanthReddy @revanth_anumula pic.twitter.com/ptclYWdXMA
— Congress for Telangana (@Congress4TS) March 6, 2024
పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని ఎప్పుడూ నేతలకు చెబుతూ ఉంటా. సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించా. ప్రధాని మోదీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉందన్నారు. మోడీతో అయినా... కేడీతో అయినా కొట్లాడుతానన్నారు. మనం ఇచ్చే మర్యాద మన రాష్ట్రానికి మేలు జరగాలని మాత్రమే అన్నారు.
అసూయ నా మీద విషం కక్కుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు.. తొంబై రోజుల మా పాలనకు రెఫరెండం. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించబోతున్నాం. కేసీఆర్‌కు ఒంట్లో బాగాలేకపోతే.. అసెంబ్లీకి రాకుండా నల్గొండకు ఎందుకు వెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థదిగా జీవన్ రెడ్డిని గెలిపించాలి. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందిరమ్మ రాజ్యం వస్తే 6 నెలలు కూడా ఇండనివ్వరా?
40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? పార్టీ ఫిరాయింపులు, పార్టీల్ని చీల్చడమే మీ విధానమా? పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా? మా ప్రభుత్వం మీదకు వస్తే తొక్కుకుంటూ.. బొందపెడతాం. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇది నా ఆన’ అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణను లూటీ చేసిందని ఆరోపించారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కేసీఆర్ అలా చేయలేదు కానీ మందేసి పామ్ హౌస్‌లో పడుకున్నారని ఆరోపించారు. తనపై అసూయతో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఒంట్లో బాగా లేక అసెంబ్లీకి రాలేదని చెబుతున్నారని... మరి నల్గొండ సభకు ఎలా వెళ్లారు? అని ప్రశ్నించారు. మూడు నెలల పాలనలోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ జిల్లా నుంచి రెండు సీట్లలో కాంగ్రెసే గెలవాలన్నారు. తమ 90 రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికల ఫలితాలు రెఫరెండమన్నారు.
మా ప్రభుత్వం మీదకు ఎవరైనా వస్తే తొక్కుకుంటూ వెళ్లి బొంద పెడతామని హెచ్చరించారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు. గద్వాలకు నీళ్లు తెస్తానన్న కేసీఆర్ ఎందుకు తీసుకు రాలేదో చెప్పాలన్నారు. పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని చెప్పారు.
బీఆర్ఎస్‌తో కలిసి వెళతామని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీరును రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. తన పూర్వీకులు రాజకీయ నాయకులు, సీఎంలు కాలేదని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ పదేళ్లు అధికారంలో ఉన్నారని... ఇక కాంగ్రెస్ కూడా పదేళ్లు అధికారంలో ఉండి తీరాలన్నారు.
వంశీచందర్‌రెడ్డిని ఎంపీగా, జీవన్‌రెడ్డిని పాలమూరు శాసనమండలి అభ్యర్థిగా గెలిపించండి.2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవాలి.. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలి’’ అని సీఎం అన్నారు.