Hyd, Mar 7: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు (Half-Day Schools in Telangana) నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు (విద్యా సంవత్సరం ముగిసే వరకు) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటి పూట బడులు (Half-day schools) నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడపాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెట్ స్కూళ్లలలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఎమ్మెల్సీల నియామకాలపై రేవంత్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు, గవర్నర్ కోటాలో జారీ చేసిన గెజిట్‌ను కొట్టేసిన ధర్మాసనం
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పది పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని వెల్లడించింది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.