Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 13వందలకు పైగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, కొలువుల జాతరను కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ విద్య కమిషనరేట్ పరిధిలో 1392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ తాజా ప్రకటనలో పేర్కొంది.
Hyderabad, DEC 09: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం. తాజాగా జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్ణయించింది. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ విద్య కమిషనరేట్ పరిధిలో 1392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ తాజా ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇంటర్ విద్య కమిషనరేట్‌లో 91 ఫిజికల్ డైరెక్టర్, 40 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడింది.
ఇప్పటికే భారీ ఎత్తున పోలీసు జాబ్స్ కోసం రాత పరీక్షలు పూర్తయ్యాయి. తాజాగా ఈవెంట్స్ కూడా మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. దాంతో పాటూ పలు శాఖల్లో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన భర్తీ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేలోపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎలాంటి అడ్డుంకులు లేకుండా నోటిఫికేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహిస్తోంది.
(The above story first appeared on LatestLY on Dec 09, 2022 08:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

