Telangana Rain Update: బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన 24గంటల్లో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Telangana Rain Update: బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్
Hyderabad Rains Video (photo-ANI)

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన 24గంటల్లో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలహీనపడినట్లు తెలిపింది.  బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, తెలుగు రాష్ట్రాలకు వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

రుతుపవన ద్రోణి ఈరోజు జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతం గుండా మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తూ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరో అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ రోజు అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో 154 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. జానకంపేట, ఎడపల్లిలో 120 మిల్లీమీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దహెగాంలో 137 మిల్లీమీటర్లకుపైగా వర్షం కురిసింది. బుధవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ ఈ మేరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.ఈ నెల 21 వరకు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం రికార్డయ్యే ఛాన్స్‌ ఉందని వివరించింది.

(The above story first appeared on LatestLY on Jul 17, 2024 09:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).