బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ (IMD) తెలిపింది. దీనికి తోడు ఈ నెల 19న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ( Heavy Rains in Andhra Pradesh) కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ నెల 18, 19 తేదీల్లో ఏపీ రాష్ట్రంలో రెండు మూడు చోట్ల అతి భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం (Weather Forecast for Telugu States) ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.రేపు (జులై 17) అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాదకరంగా మారిన హుస్సేన్ సాగర్, లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక, ఈ నెల 18 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో నేడు వాన పడే అవకాశం
సోమవారం కృష్ణా, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, కర్నూలు, ఎన్టీఆర్, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 65.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో రోజంతా వర్షం కురవడంతో రహదారులపై వరదనీరు నిలిచింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. హైదరాబాద్ లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో నరకం చూస్తున్న వాహనదారులు,కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
తెలంగాణలో రాగల ఐదురోజుల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని విదర్భను ఆనుకొని ఉందని.. అనుబంధంగా ఉపరితల ఆవర్తం సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉందని పేర్కొంది.ప్రస్తుతం రాష్ట్రంపైన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వివరించింది
అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య ప్రాంతాలను ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణశాఖ తెలిపింది.