Weather Forecast: ఓ వైపు ఎండలు, మరో వైపు వానలు, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు, అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.ఈ సారి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు పెరుగుతూ ఉండగా మరోవైపు వర్షాలు పడుతున్నాయి.

Weather Forecast: ఓ వైపు ఎండలు, మరో వైపు వానలు, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు, అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ
Credits: Twitter

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.ఈ సారి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు పెరుగుతూ ఉండగా మరోవైపు వర్షాలు పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి ఆదివారం దాకా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది.

పుల్లుగా మందు తాగి కోరిక తీర్చాలంటూ అర్థరాత్రి యువతి ఇంటికి వెళ్లి వేధింపులు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపిన యువతి

గురు, శుక్రవారాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపింది.అదే సమయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్, నిర్మల్, నాగర్కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రియుడితో లేచిపోయిన భార్య, నీ కూతురు లేచిపోయిందంటూ మామను తుపాకీతో కాల్చి చంపిన అల్లుడు, మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి..

నిజామాబాద్ లోని జక్రాన్ పల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని జిల్లాల్లో ఎండ 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

(The above story first appeared on LatestLY on Mar 30, 2023 07:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).