Rs 2000 Notes: రూ.7,755 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇంకా ప్రజల వద్దే.. వెంటనే ఈ 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ సూచన

రూ.2 వేల నోట్లు (Rs 2,000 Notes) చలామణి నుంచి దాదాపు 97.87 శాతం మేర తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.

2000 Notes (Photo Credits: Pixabay)

రూ.2 వేల నోట్లు (Rs 2,000 Notes) చలామణి నుంచి దాదాపు 97.87 శాతం మేర తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.కాగా 2023 మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.గతేడాది  అక్టోబర్‌ 7దాకా దేశంలోని అన్ని బ్యాంక్‌ శాఖల్లో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. ఏడేళ్లకే ముగిసిన రూ. 2 వేల నోటు ప్రస్థానం, ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసా..

నాడు చలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. కాగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2016లో రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు చలమాణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్ల మార్పిడికి వీలుంది. ఈ నోట్లు ఇంకా ఎవరి దగ్గరైనా ఉంటే అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ శాఖల్లో  మార్చుకోవచ్చు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement