Rs 2000 Note Journey and History: ఏడేళ్లకే ముగిసిన రూ. 2 వేల నోటు ప్రస్థానం, ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసా..
2000 Note

New Delhi, May 19: క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటును ఉపసంహరించినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించింది. దీంతో కరెన్సీపై ప్రజల్లో కాస్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా రూ.2వేల నోట్లు దాచుకున్న వారు కలవర పడుతున్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లన్నీ ఆర్బీఐకి తిరిగిచ్చేయాలి. ఇందుకు సెప్టెంబర్‌ 30ని తుది గడువుగా ప్రకటించింది.

2016 నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి అర్ధంతరంగా పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ చెప్పారు.ప్రజల అవసరాల కోసం 2016 నవంబర్ 10 నుంచే రూ.2000 నోటును ఆర్బీఐ చలామణిలోకి తెచ్చింది. మహాత్మ గాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా దీంతో పాటు రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను కొత్త డిజైన్‌తో విడుదల చేసింది.దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు రూ.2 వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోండి, వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ

రూ. 1000 నోట్లను రద్దు చేశాక దానికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రూ.2 వేల నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. రంగు, డిజైన్‌ ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయం మంగళ్‌యాన్‌ ఉపగ్రహ ప్రయోగం. దీనికి సంబంధించిన చిత్రాన్ని రూ.2 వేల నోటుపై ముద్రించింది. రూ.2 వేల నోట్లను ఆర్బీఐ మైసూరులో ప్రింట్‌ చేసింది. మైసూరులోని ఆర్బీఐ ముద్రణా కార్యాలయంలో ఈ నోటు తయారైంది.

అయితే 2018లోనే రూ.2000 నోటు ముద్రణ నిలిపేశామని తాజాగా ఆర్బీఐ వెల్లడించింది. అయితే, 2017 మార్చి నాటికే 89 శాతం రూ.2000 నోట్ల ముద్రణ పూర్తయింది. ఏడేండ్ల క్రితం చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు.. ఆర్బీఐ చెప్పిన ప్రకారం రెండేండ్లకే ముద్రణ నిలిపేసింది.

 2000 రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలి, ఏ తేదీ లోపల మార్చుకోవాలని ఆర్ బీఐ చెప్పింది, పూర్తి వివరాలు ఇవిగో..

కొంత కాలంగా బ్యాంకుల్లో రూ.2000 నోట్లు చలామణీలో లేవు. 2016లో బ్లాక్ మనీని వెలికి తీసే లక్ష్యంతో పాత పెద్ద నోట్లు ఉపసంహరించి, రూ.2000 విలువైన నోటు తెచ్చామని కేంద్రం చెప్పింది. కానీ, బ్లాక్ మనీగా దాచి పెట్టుకోవడానికి రూ.2000 ఉపయుక్తంగా ఉందనే అభిప్రాయం వెల్లడైంది.

ఆర్బీఐ డేటా ప్రకారం.. కొంత కాలంగా బ్యాంకుల్లో రూ.2000 నోట్లు చలామణీలో లేవు. 2016లో బ్లాక్ మనీని వెలికి తీసే లక్ష్యంతో పాత పెద్ద నోట్లు ఉపసంహరించి, రూ.2000 విలువైన నోటు తెచ్చామని కేంద్రం చెప్పింది. కానీ, బ్లాక్ మనీగా దాచి పెట్టుకోవడానికి రూ.2000 ఉపయుక్తంగా ఉందనే అభిప్రాయం వెల్లడైంది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం 2018 మార్చి నెలాఖరు నాటికి రూ.6.73 లక్షల కోట్లకు రూ.2000 నోట్ల చలామణి తగ్గిపోయింది. నాటి నుంచి 2023 మార్చి నెలాఖరు నాటికి రూ.3.62 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ప్రస్తుతం చలామణిలో 10.8 శాతం నోట్లు మాత్రమే ఉన్నాయని తెలుస్తున్నది.