Apple iPhone 13 Series: ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ వచ్చేసింది, ఐఫోన్‌ 13 సిరీస్‌ ధరలు, ఫీచర్లు, అందుబాటు తేదీలు ఓ సారి తెలుసుకోండి

టెక్‌ దిగ్గజం ఆపిల్‌..ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లను విడుదల చేసింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆపిల్‌ చీఫ్‌ టిమ్‌ కుక్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. అయితే స్టాటిస్టా లెక్కల ప్రకారం భారత్‌లో కేవలం 3 శాతం మార్కెట్‌కే పరిమితమైనఆపిల్‌..ఆ మార్కెట్‌ను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

Apple iPhone 13 Series: ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ వచ్చేసింది, ఐఫోన్‌ 13 సిరీస్‌ ధరలు, ఫీచర్లు, అందుబాటు తేదీలు ఓ సారి తెలుసుకోండి
Apple iPhone 13 Series (Photo Credits: Apple)

టెక్‌ దిగ్గజం ఆపిల్‌..ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లను విడుదల చేసింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆపిల్‌ చీఫ్‌ టిమ్‌ కుక్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. అయితే స్టాటిస్టా లెక్కల ప్రకారం భారత్‌లో కేవలం 3 శాతం మార్కెట్‌కే పరిమితమైనఆపిల్‌..ఆ మార్కెట్‌ను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ వర్చువల్‌ ఈవెంట్‌లో ఆపిల్‌ చీఫ్‌ టిమ్‌ కుక్‌ ఇండియన్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ 13 సిరీస్‌ (Apple iPhone 13 Series) ఫోన్‌ ధరల్ని ప్రకటించారు. వాటి ధరలు ఇలా ఉన్నాయి. ఆపిల్‌ విడుదల చేసిన ఐఫోన్‌13 సిరీస్‌ ఫోన్‌ ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్17,శుక్రవారం సాయంత్రం 5:30నుంచి ప్రారంభం కానుండగా..సెప్టెంబర్ 24 శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయి.

ఐఫోన్‌ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. వెనుకవైపు అధునాతన డ్యుయల్‌ కెమెరాలు, 5జీ, 6 కోర్‌ సీపీయూ, 4 కోర్‌ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్‌ చిప్‌సెట్‌ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్‌ 13 డిస్‌ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్‌ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్‌ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్‌ 12తో పోలిస్తే ఐఫోన్‌ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది.

ఆర్బీఐ సంచలన నిర్ణయం, విదేశాల్లో ఉన్నవారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపవచ్చు, తొలుత సింగపూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియా, 2022 జులై నుంచి ఒప్పందం అమల్లోకి

స్టోరేజీ విషయానికొస్తే ఇవి 128 జీబీ నుంచి లభిస్తాయి. ఐఫోన్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. అటు ఐఫోన్‌ 13 సిరీస్‌తో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్‌ వాచ్‌ 7 సిరీస్‌ మొదలైన ఉత్పత్తులను కూడా యాపిల్‌ ఆవిష్కరించింది. వాచ్‌ 7 సిరీస్‌ రేటు 399 డాలర్ల నుంచి ఉంటుంది. ప్రో ధర 999 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్‌ రేటు 1,099 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. 128 జీబీ నుంచి 1టీబీ దాకా స్టోరేజీతో లభిస్తుంది. ఐఫోన్‌ 13 ప్రీ ఆర్డర్లు ఈ నెల 17 నుంచి, డెలివరీలు 24 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

మనదేశంలో ఐఫోన్‌ 13 సిరీస్‌ ధరలు

ఐఫోన్‌ 13ప్రో మ్యాక్స్‌

128జీబీ: రూ.1,29,900

256జీబీ: రూ. 1,39.900

512జీబీ: రూ. 1,59,900

1జీబీ : రూ. 1,79,900

ఐఫోన్ 13 ప్రో

128జీబీ: రూ. 1,19,900

256జీబీ: రూ. 1,29,900

512జీబీ:రూ. 1,49,900

1జీబీ : రూ. 1,69,900

ఐఫోన్ 13

128జీబీ: రూ.79,900

256జీబీ: రూ. 89,900

512జీబీ: రూ. 1,09,900

ఐఫోన్ 13 మినీ

128జీబీ: రూ. 69,900

256జీబీ: రూ. 79,900

512జీబీ: రూ. 99,900

(The above story first appeared on LatestLY on Sep 15, 2021 02:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).