Child Pornography: జాగ్రత్త...చిన్న పిల్లల పోర్న్ వీడియోలు చూస్తే పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది, చైల్డ్ పోర్న్ సైట్స్ కోసం సెర్చ్ చేసే వారిపై ఫోకస్ పెట్టిన NCRB, హైదరాబాద్‌లో 16 మంది అరెస్ట్
దేశంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు మైనర్లపై హత్యాచారాలకు పాల్పడి వారిని చిదిమేస్తున్నారు. ముద్దులొలికే చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శించి వారి జీవితాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. వీరి నుంచి పసిబిడ్డలను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
దేశంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు మైనర్లపై హత్యాచారాలకు పాల్పడి వారిని చిదిమేస్తున్నారు. ముద్దులొలికే చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శించి వారి జీవితాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. వీరి నుంచి పసిబిడ్డలను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇకపై చైల్డ్ పోర్న్ సైట్ లలోకి వెళ్తే జైలుకెళ్లడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా నెట్‌లో అశ్లీల చిత్రాలు.. చైల్డ్ పోర్న్ (Child Pornography) సైట్స్ కోసం సెర్చ్ చేసే వారిపై NCRB ఫోకస్ పెట్టింది.
ఇందుకోసం ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్‌లో చైల్డ్ సెక్స్ అభ్యుజ్ మెటీరియల్ అనే ప్రత్యేక సెల్ కొనసాగుతోంది. నెట్‌లో ఎవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకోవడమే ఈ సెల్ పని. బ్యాన్ చేసిన సైట్లను చూస్తే ఇక జైలుకే. కేవలం చైల్డ్ పోర్న్ సైట్స్ చూడటమే కాదు.. గూగుల్‌లో చైల్డ్ పోర్న్ అని టైపి చేసినా వెంటనే వాళ్లకు ఇన్‌ఫర్‌మేషన్ వెళ్తుంది. ఈ నేపథ్యంలో, బాలల అశ్లీలలతకు సంబంధించిన ఫోటోలు వీడియోలు చూస్తున్న 16 మందిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyderabad Cybercrime police) కేసు నమోదు చేశారు.
ఐపీ చిరునామాల ఆధారంగా హైదరాబాద్ కు చెందిన 16 మందిని గుర్తించిన కేంద్ర NCRB హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ 16 మంది ( 16 people for watching child pornography) ఐపీ అడ్రస్ లను పంపించింది. వారిపై ఐటి యాక్ట్ 67B కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేసి వారి ఐపి అడ్రస్ ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు.. గతేడాది కూడా ఇదే తరహాలో సిఐడి పంపించిన సైబర్ క్రైం పోలీసులు ఐపీ అడ్రస్‌ల ద్వారా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
(The above story first appeared on LatestLY on Sep 19, 2021 07:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

