Mobile (Photo Credit: File)

మొబైల్ ఇంటర్నెట్ డేటా మరింతగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లలో పోర్న్ సైట్‌లను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షంచటం భారత్‌లో చట్టవిరుద్ధం చేసింది. అయినప్పటికీ టెక్నికతో చాలా మంది ఈ వీడియోలను చూస్తున్నారు. ఈ కరోనా కాలంలో అయితే ఈ వీడియోల వాడకం భారీ స్థాయిలో పెరిగిందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

ఈ వీడియోలు చూడటం వల్ల చాలా ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం (Smartphone Users Alert) ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ మొబైల్ హ్యాకింగ్ దగ్గర నుంచి మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలు గుల్లయ్యే వరకు చాలా సమస్యలు (watching porn is bad for your Android Phone) ఎదురువుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని (Porn Videos in Mobile Phone) చూడటం వల్ల కొన్ని అంశాల రూపంలో పెద్ద ముప్పే పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షించే ముందు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఓ సారి చూద్దాం.

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్, కస్లమర్లకు భారీ ఊరట, ఏటీఎంలో క్యాష్ లేకుంటే రూ. 10 వేల వ‌ర‌కు పెనాల్టీ, అక్టోబరు ఒకటో తేదీ నుంచి నిబంధన అమల్లోకి

రాన్సమ్‌వేర్

స్మార్ట్‌ఫోన్‌లలో తరచూ మీరు పోర్న్ సైట్‌లను వీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్‌కు రాన్సమ్‌వేర్ ముప్పు పొంచి ఉన్నట్లే. యూజర్ ఓ పోర్న్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన వెంటనే ఓ పాపప్ లాంటిది ఓపెన్ అయి వెంటనే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను పూర్తిగా లాక్ చేసేస్తుంది.

బ్లాక్ మెయిలింగ్‌

ఆ లాక్‌ను ఓపెన్ చేయాలంటే కొత్త మొత్తంలో డబ్బను చెల్లించాలంటూ హ్యాకర్లు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ డబ్బు చెల్లించినప్పటికి మీ ఫోన్ యాదాస్థితికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థతి. కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌‌లలో పోర్న్ కంటెంట్ వీక్షించే ముందు ఈ విషయాన్ని గుర్తంచుకోండి.

అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్,మత్తు మందు ఇచ్చి వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం,ఇంకా కనిపించని అక్క అచూకి, గాంధీ ఆస్పత్రిలో దారుణ ఘటన, కేసును దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు

చైల్డ్ పోర్నోగ్రఫీ..

చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించటం చట్టవిరుద్ధం. మొబైల్ ఫోన్ లలో చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించినట్లు రుజువులు దొరికేతే తప్పనిసరిగా అటువంటి వ్యక్తులు కఠినమైన లీగల్ సమస్యలను ఫేస్ చేయవల్సి ఉంటుంది

వ్యక్తిగత డేటా గల్లంతు

పోర్న్ వెబ్‌‌సైట్‌లలో వైరస్‌ను జొప్పించే లింక్స్ తప్పనిసరిగా ఉంటాయి. అటువంటి లింక్స్ పై క్లిక్ చేయటం ద్వారా యూజర్కు తెలియకుండానే వైరస్ అతని డివైస్‌లోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును కూడా దొంగిలించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‌

గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధితురాలి సోదరి కోసం పోలీస్ బృందాలు గాలింపు, బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుదని తెలిపిన రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి

పోర్న్ యాప్స్

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు అవగాహన రాహిత్యంతో పోర్స్ యాప్స్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు. ఈ చర్యతో వాళ్ల స్మార్ట్‌ఫోన్ చిక్కుల్లో పడినట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్ వైరస్‌లు వీరి ఫోన్‌లలోకి ప్రవేశించి లోపలి డేటాను చిన్నాభిన్నం చేసేస్తాయట.

అడల్ట్ కంటెంట్‌

అడల్ట్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తోన్న వెబ్‌సైట్ ప్రొవైడర్స్ తన సైట్‌లను సందర్శించే మొబైల్ ఫోన్ యూజర్లకు చాట్, ఎస్ఎంఎస్, ప్రీమీయమ్ ఎస్ఎంఎస్, వాప్, లోకేషన్ వంటి సర్వీసులను ఎరవేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఒక్కోసారి యూజర్‌కు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివేట్ కాబడతాయని, దింతో యూజర్ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్లేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు.