Parag Agrawal: ట్విట్టర్ కొత్త సీఈఓగా పరాగ్ అగర్వాల్, పదవి నుంచి వైదొలిగిన జాక్ డోర్సీ, ట్విట్టర్ ద్వారా అందరికీ ధన్యవాదాలు చెబుతూ నోట్ విడుదల చేసిన పరాగ్
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయన స్థానంలో సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. పరాగ్ అగర్వాల్.. ఇండో అమెరికన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా నిలిచారు.
- Read in
- తెలుగు
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయన స్థానంలో సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. పరాగ్ అగర్వాల్.. ఇండో అమెరికన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా నిలిచారు. బాంబే ఐఐటీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన తర్వాత అగర్వాల్.. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్నారు. 2011 అక్టోబర్‌లో ట్విట్టర్‌లో పరాగ్ అగర్వాల్ చేరారు. నాటి నుంచి సంస్థలు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ట్విట్టర్‌లో చేరకముందు ఆయన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూలో సేవలందించారు. ట్విట్టర్ టెక్నికల్ స్ట్రాటర్జీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ అండ్ సైన్స్ టైమ్‌లకు ఇప్పటి వరకు బాధ్యత వహించారు. 2019 డిసెంబర్‌లో పరాగ్ అగర్వాల్‌ను ప్రాజెక్ట్ బ్లూస్కై అనే ఇండిపెండెంట్ టీంకు ఇన్‌చార్జిగా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికపై దుర్భాషలాడే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించడానికి డీ సెంట్రలైజ్డ్ స్టాండర్డ్‌తో కూడిన టూల్స్ తయారు చేసే ఆర్కిటెక్‌లు, ఇంజినీర్లు, డిజైనర్లకు ఈ బ్లూ స్కై వనరుగా ఉంటుంది.
Deep gratitude for @jack and our entire team, and so much excitement for the future. Here’s the note I sent to the company. Thank you all for your trust and support 💙 https://t.co/eNatG1dqH6 pic.twitter.com/liJmTbpYs1
— Parag Agrawal (@paraga) November 29, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 29, 2021 10:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

