Jio New Plan: జియో నుంచి అదిరిపోయే ప్లాన్, ఈ రోజు రీఛార్జ్ చేయిస్తే వచ్చె నెల ఇదే రోజు దాకా ప్లాన్, ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్
టెలికాం రంగంలో దూసుకుపోతున్న భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సరికొత్త ప్లాన్ (Jio New Plan) తీసుకువచ్చింది. ఇది నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ధర రూ.259. ఇప్పుడున్న ప్లాన్ లలో చాలావరకు 24 రోజులు, 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు వరకు వర్తించేలా ఉంటాయి.
టెలికాం రంగంలో దూసుకుపోతున్న భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సరికొత్త ప్లాన్ (Jio New Plan) తీసుకువచ్చింది. ఇది నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ధర రూ.259. ఇప్పుడున్న ప్లాన్ లలో చాలావరకు 24 రోజులు, 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు వరకు వర్తించేలా ఉంటాయి. అయితే, జియో 259 ప్లాన్ (Reliance Jio Rs. 259 Calendar Month Validity Prepaid Plan) ప్రత్యేకత ఏంటంటే... దీనికి రోజులతో సంబంధం లేదు. ఓ నెలలో 2వ తేదీన ఈ ప్లాన్ తీసుకుంటే, మళ్లీ వచ్చే నెలలో సరిగ్గా 2వ తేదీనే రీచార్జి చేయించాల్సి ఉంటుంది. కరోనా కాలర్ ట్యూన్ ఇక ఉండదు, కొవిడ్ కాలర్ ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని తెలిపిన పీటీఐ
ప్లాన్ వివరాలు చూస్తే... రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తారు. ఇతర ప్రయోజనాలు అదనంగా లభిస్తాయి. ఇలా కచ్చితంగా నెలరోజులకు వర్తించేలా తీసుకువచ్చిన ప్లాన్ దేశంలో ఇప్పటివరకు ఇదొక్కటే. ఇటీవల ట్రాయ్ టెలికాం సంస్థలకు పలు ఆదేశాలు ఇచ్చింది. నెల రోజుల కాలపరిమితితో రెగ్యులర్ ప్లాన్, స్పెషల్ టారిఫ్, కాంబో పథకాలను తప్పనిసరిగా వినియోగదారులకు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది.
(The above story first appeared on LatestLY on Mar 28, 2022 05:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

