కరోనా సమయంలో ఎంతో మందికి వినిపించిన కోవిడ్‌ కాలర్‌ ట్యూన్‌ ఇకపై మూగబోనుంది. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే కొవిడ్‌ నిబంధనలను ఎత్తివేయాలని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్చి 31వ తేదీ నుంచి కేవలం మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు మాత్రమే కొనసాగనున్నాయి. దేశంలో కరోనా తీవ్రత తగ్గడంతో ఫ్రీ కాల్‌ సందేశాలను నిలిపి వేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం ఆదివారం ఓ లేఖ రాసింది. భారత సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం, మొబైల్‌ వినియోగదారుల నుంచి కాలర్‌ ట్యూన్‌ నిలిపివేయాలని విజ్ఞప్తులు వచ్చినట్లు ఆ లేఖలో పేర్కొంది. దీంతో కొవిడ్‌ కాలర్‌ ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందంటూ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)