UFO (Credits: BBC)

Newyork, October 23: అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఉండొచ్చని, అక్కడ జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఆశాభావంతో ఉన్నారు. గ్రహాంతర జీవులు మనకంటే అభివృద్ధి చెందినవారని, వారు ఉపయోగించే వాహనాల్లోని టెక్నాలజీ మానవుడి ఊహకు అందని స్థాయిలో ఉంటుందని కొన్ని వాదనలు వినిపిస్తుంటాయి. ఈ వాదనలకు ఊతమిచ్చేలా.... ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ల వంటి గుర్తుతెలియని వస్తువులు (యూఎఫ్ఓ) తిరుగుతుండడాన్ని చూసినట్టు అనేకమంది చెబుతుంటారు. అయితే యూఎఫ్ఓలకు సంబంధించి ఇప్పటిదాకా నిర్దిష్ట ఆధారాలు లేవు. కొంతమంది వాటిని ఫొటోలు తీశామని చెబుతుండగా, ఆ ఫొటోల స్పష్టత అంతంతమాత్రమే. దాంతో ఈ ఫ్లయింగ్ సాసర్ల అంశం మానవాళికి ఓ మిస్టరీలా మారింది.

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు ధరించను.. మంత్రి సత్యవతి రాథోడ్, సెప్టెంబరు 17 నుంచి దీక్షలో ఉన్నానన్న మంత్రి.. గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో చేస్తున్నారన్న ప్రశంస

ఈ నేపథ్యంలో, యూఎఫ్ఓల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన 16 మందికి స్థానం కల్పించింది. ఈ బృందానికి డేవిడ్ స్పెర్గెల్ నాయకత్వం వహిస్తారు. యూఎఫ్ఓల ఉనికిపై 9 నెలల పాటు సాగే ఈ అధ్యయనం అక్టోబరు 24న ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక బృందం రూపొందించే నివేదికను వచ్చే ఏడాది బహిర్గతం చేయనున్నారు.