El Niño 2027 Alert: ప్రపంచానికి ముప్పు ముంచుకొస్తోంది.. ఒకవైపు అకస్మిక వరదలు, మరొకవైపు తీవ్ర కరువు పరిస్థితులు.. హెచ్చరించిన ప్రపంచ వాతావరణ సంస్థ

పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న వాతావరణ పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సంచలన హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ భీకర పరిస్థితులు కొనసాగే అవకాశం 100 శాతం ఉందని స్పష్టం చేసింది.

Super El Niño

El Niño 2027 Alert: పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న వాతావరణ పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సంచలన హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ భీకర పరిస్థితులు కొనసాగే అవకాశం 100 శాతం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో భూగోళం వేడెక్కడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు అకస్మిక వరదలు, మరొకవైపు తీవ్ర కరువు పరిస్థితులు దాపురిస్తాయని సంస్థ వెల్లడించింది.

ఈ వరదల విధ్వంసానికి మీరే కారణం.. భారత్, చైనా, అమెరికా నుంచి నష్ట పరిహారం డిమాండ్ చేసిన నేపాల్..

ఈ పరిణామంపై డబ్ల్యూఎమ్‌ఓ సెక్రటరీ జనరల్ సెలెస్టీ సౌలో మాట్లాడుతూ.. స్పానిష్ భాషలో ‘ఎల్ నినో’ అంటే చిన్న పిల్లోడని అర్థమని, అయితే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు, మానవాళికి పెను విపత్తు తెచ్చిపెట్టే తీవ్ర సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దీని ప్రభావంతో పలు దేశాల్లో తీవ్ర వరదలు, అనావృష్టి పరిస్థితులు కనిపిస్తున్నాయని, రాబోయే నెలల్లో ఇది మరింత తీవ్రతరం కానుందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సైతం స్పందిస్తూ.. భూగ్రహం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరమైన వాతావరణ స్థితికి చేరుకుందని వ్యాఖ్యానించారు.

భారతీయ వాతావరణ శాఖ (IMD) కూడా ఇప్పటికే దేశంలో ఎల్ నినో ప్రభావం ప్రారంభమైందని ధృవీకరించింది. ఐఎమ్‌డీ వెల్లడించిన కీలక అంశాలు:

ఆగస్టు రికార్డు వేడి: ఎల్ నినో ప్రభావంతో గత ఆగస్టు నెలలో దేశంలో సాధారణం కంటే 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది 1901 నుంచి భారతదేశ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన ఆగస్టు నెలగా నిలిచింది.

సెప్టెంబర్ వర్షపాతంపై దెబ్బ: సెప్టెంబర్ మాసంలో కూడా సాధారణ వర్షపాతం (167.9 మిమీ) కంటే చాలా తక్కువగా, సగటున 91 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది.

ఉత్తరాదిపై ప్రతికూల ప్రభావం: ఈ ప్రభావం వల్ల ఈసారి శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదముంది. 'క్లైమేట్ ట్రెండ్స్' సంస్థ అధ్యయనం ప్రకారం, గత దశాబ్ద కాలంలో ఫిబ్రవరిలో 0.69°C, మార్చిలో 0.58°C, ఏప్రిల్‌లో 0.66°C మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి.

ఈ విధంగా శీతాకాలం వ్యవధి తగ్గి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం వల్ల ఉత్తరారభారతంలో రబీ సీజన్‌లో వేసే గోధుమ పంట దిగుబడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని, విత్తనోత్పత్తి నశించి వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement