Electric Bandage: తీవ్ర గాయాలను సైతం వేగంగా నయంచేసే ఎలక్ట్రిక్‌ బ్యాండేజీ.. 30% వేగంగా గాయం నుంచి ఉపశమనం పొందొచ్చట!

డయాబెటిక్‌ రోగులకు గాయలైతే ఎంతకీ తగ్గవు. ఇలాంటి వారి కోసం వినూత్నమైన ‘ఎలక్ట్రిక్‌ బ్యాండేజ్‌’ని నార్త్‌ కరోలినా స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.

Electric Bandage: తీవ్ర గాయాలను సైతం వేగంగా నయంచేసే ఎలక్ట్రిక్‌ బ్యాండేజీ.. 30% వేగంగా గాయం నుంచి ఉపశమనం పొందొచ్చట!
Electric Bandage (Credits: X)

Newdelhi, Aug 12: డయాబెటిక్‌ (Diabetes) రోగులకు గాయలైతే ఎంతకీ తగ్గవు.  ఇలాంటి వారి కోసం వినూత్నమైన ‘ఎలక్ట్రిక్‌ బ్యాండేజ్‌’ని (Electric Bandage) నార్త్‌ కరోలినా స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. డయాబెటిస్ రోగులకే కాకుండా సాధారణ వ్యక్తులకు కూడా అయ్యే తీవ్ర గాయాలను సైతం ఈ బ్యాండేజ్‌ లు నయం చేయగలవని వాళ్లు చెప్తునారు. సాధారణ బ్యాండేజ్‌ లతో పోల్చితే 30% వేగంగా గాయాల  నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.

మేము విడిపోవడం కన్నా చనిపోవడమే మేలు, బీహార్‌లో లవర్స్ హైడ్రామా వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఎలా పనిచేస్తుందంటే?

గాయమైన ప్రాంతంలో ఈ బ్యాండేజ్‌ ని అతికించాలి. అలా అతికించాక.. దానిపై ఒక నీటి బిందువు వెయ్యాలి. దీంతో  బ్యాండేజ్‌ లోని బ్యాటరీ యాక్టివేట్‌ అవుతుంది. అనంతరం గాయం చుట్టూ విద్యుత్తు క్షేత్రం ఏర్పడి.. కొన్ని గంటల్లోనే గాయం తగ్గడానికి ఛాన్స్ ఏర్పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

పాట్నాను ముంచెత్తిన భారీ వర్షాలు, బీహార్ అసెంబ్లీ ప్రాంగణం, మంత్రుల ఇళ్లు జలమయం, పరిస్థితిని సమీక్షించిన సీఎం నితీష్ కుమార్

(The above story first appeared on LatestLY on Aug 12, 2024 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).