Magical Cancer Drug Cures Women (Credits: X)

Newdelhi, Oct 9: క్లినికల్‌ ట్రయల్స్‌ లో (Clinical Trials) భాగంగా వైద్యులు ఓ క్యాన్సర్‌ రోగికి (Cancer Patient) ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది. బ్రిటన్‌ (Britain) కు చెందిన ఓ 42 ఏండ్ల మహిళను క్యాన్సర్‌బారి నుంచి బయటపడేసింది. ‘డోస్టర్‌ లిమాబ్‌’ అనే కొత్త డ్రగ్‌ ను ఆరు నెలలు వాడగా.. స్టేజ్‌-3 క్యాన్సర్‌ కనుమరుగయ్యాయి. క్యాన్సర్‌ చికిత్సలో దీనిని ఓ మిరాకిల్‌ డ్రగ్‌ గా వారు పేర్కొన్నారు. ‘రేడియోథెరపీ, సర్జరీ, కీమోథెరపీ లేకుండా చికిత్స అందించాం. ‘డోస్టర్‌ లిమాబ్‌’ క్యాన్సర్‌ కణాలపై అద్భుతంగా పనిచేసింది’ అని స్వాన్స్‌ సీ బే యూనివర్సిటీ హెల్త్‌ బోర్డ్‌ తెలిపింది.

207 KG Roti: ఇదేందయ్యా ఇది.. ఇంత పెద్ద చపాతీనా?? ప్రపంచంలోనే అతిపెద్ద రోటీ ఇది. తయారీకి 2 గంటలు.. కాల్చేందుకు మరో ఐదు గంటల సమయం.. ఇంతకీ ఎవరు, ఎక్కడ తయారుచేశారంటే??

గత ఏడాది కూడా..

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ఇమ్యునోథెరపీ డ్రగ్‌ ఇది. గత ఏడాది ఈ ఔషధాన్ని వాడిన 18 మంది క్యాన్సర్‌ నుంచి పూర్తిగా బయటపడ్డారని వైద్య పరీక్షల్లో తేలింది.

TS Election Schedule: నేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్.. మీడియాకు ఈసీ అధికారిక సమాచారం.. మరిన్ని వివరాలు ఇదిగో..