‘Pregnant’ Cars in China: ఇదేందయ్యా.. ఇది..!? చైనాలో ప్రెగ్నెంట్ కార్లు.. ఎండలే కారణం అంటున్న నిపుణులు.. ఎండల వల్ల కార్లు ప్రెగ్నెంట్ కావడం ఏంటి??
చైనాలో ప్రెగ్నెంట్ కార్లు హల్ చల్ చేస్తున్నాయి. అదేంటి..? కార్లకు గర్భం రావడమేంటి? అనుకుంటున్నారా? అవును. మీరు చదువుతున్నది నిజమే.
Newdelhi, Aug 12: చైనాలో (China) ప్రెగ్నెంట్ కార్లు (‘Pregnant’ Cars) హల్ చల్ చేస్తున్నాయి. అదేంటి..? కార్లకు గర్భం రావడమేంటి? అనుకుంటున్నారా? అవును. మీరు చదువుతున్నది నిజమే. చైనాలో వీధుల్లో పార్క్ చేస్తున్న కార్లకు ప్రెగ్నెన్సీ వస్తున్నది. ఠారెత్తిస్తున్న ఎండలే దీనికి కారణంగా నిపుణులు చెప్తున్నారు. ఆడీ లాంటి ఖరీదైన కార్లకు కూడా ఇది తప్పడం లేదు. గర్భం దాల్చినట్టు ఉన్న కార్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ కాగా, వీటిని ‘ప్రెగ్నెంట్ కార్లు’గా వ్యవహరిస్తున్నారు.
‘Pregnant’ cars? China’s record heatwave causes cars to grow baby bumpshttps://t.co/BhtyEHeHXU
— Interesting Engineering (@IntEngineering) August 9, 2024
కారణం ఇదే!
చైనాలో కార్ల రక్షణకు వేసిన ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఎండ వేడికి వ్యాకోచం చెందడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు చెప్తున్నారు. ఎండ కారణంగా కారుకు గర్భమొచ్చినట్టు బాయ్ నెట్ ప్రాంతంలో పైకి ఎగదన్నుతున్నట్టు వాళ్లు పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Aug 12, 2024 09:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

