Hyderabad, Aug 12: తెలంగాణకు (Telangana) భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు (Rains) కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ లో సోమవారం తెల్లవారుజామున నుంచి వర్షం కురుస్తున్నది. పటాన్ చేరు, మియాపూర్, కూకట్ పల్లి, అమీర్ పేట్, సికింద్రాబాద్, నాంపల్లి, దిల్ షుఖ్ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. సాయంత్రం తర్వాత కూడా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.