amazon web services expand data centre operations at hyderabad (X)

Hyd, Aug 11: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సత్ఫలితాన్నిస్తోంది. అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్ టీం వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి పెట్టుబడులను పెట్టాల్సిందిగా కోరుతుండగా వారి నుండి మంచి స్పందన వస్తోంది. తాజాగా అమెజాన్ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించేందుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్ భేటీ అయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు తమ వ్యాపారాన్నివిస్తరిస్తామని తెలిపారు.

అమెజాన్‌తో చర్చలు సఫలమయ్యాయని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ మందుకు వస్తుందని చెప్పారు.  తెలంగాణ నుండి తరలిపోతున్న పరిశ్రమలు, కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టమని కామెంట్

Here's Tweet:

హైదరాబాద్‌లో తమ క్లౌడ్ సదుపాయాలను విస్తరిస్తామని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అమెజాన్ వెబ్సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే హైద‌రాబాద్‌లో త‌మ సంస్థ విస్త‌ర‌ణ‌కు మోనార్క్ ట్రాక్ట‌ర్ సంస్థ ముందుకు వ‌చ్చింది.