Hantavirus: చైనాను వెంటాడుతున్న మరో కొత్త వైరస్, హంటా వైరస్‌తో ఒకరు మృతి, ఎలుకలు ఉంటే హంటావైరస్ వ్యాపించే ప్రమాదం

తాజాగా మరో కొత్తరకం వైరస్ చైనా (China) దేశంలో బయటపడింది. చైనాలోని యునన్ ప్రావిన్సుల్లో ఓ వ్యక్తిలో హంటావైరస్ (Hantavirus) లక్షణాలతో సోమవారం మృతిచెందాడు. షాండాంగ్ ప్రావిన్సులకు వెళ్తున్న అతడు హంటావైరస్‌తో మృతిచెందినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది అతడు ప్రయాణించిన బస్సులోని మరో 32 మంది ప్రయాణికులకు కూడా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది.

Hantavirus: చైనాను వెంటాడుతున్న మరో కొత్త వైరస్, హంటా వైరస్‌తో ఒకరు మృతి, ఎలుకలు ఉంటే హంటావైరస్ వ్యాపించే ప్రమాదం
Representational Image (Photo Credits: Twitter)

Beijing, March 26: తాజాగా మరో కొత్తరకం వైరస్ చైనా (China) దేశంలో బయటపడింది. చైనాలోని యునన్ ప్రావిన్సుల్లో ఓ వ్యక్తిలో హంటావైరస్ (Hantavirus) లక్షణాలతో సోమవారం మృతిచెందాడు. షాండాంగ్ ప్రావిన్సులకు వెళ్తున్న అతడు హంటావైరస్‌తో మృతిచెందినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది అతడు ప్రయాణించిన బస్సులోని మరో 32 మంది ప్రయాణికులకు కూడా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది.

బ్రిటన్ రాజ కుటుంబానికి కరోనా షాక్

కాగా కరోనావైరస్ (Coronavirus) మాదిరిగా హంటావైరస్ గాలిలో ఉండదు. హాంటావైరస్ వ్యాధికి ఎలుకలే కారణం. ‘ఇంటిలో, చుట్టుపక్కల పరిసరాల్లో ఎలుకల (Rats)ఉంటే హంటావైరస్ వ్యాపించే ప్రమాదంగా ఉంది. ఈ వైరస్ బారిన పడితే సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా హెచ్‌పిఎస్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది’ అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది.

హెచ్‌పీఎస్ కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఎలుకల లాలజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని తెలిపింది. చిలీ, అర్జెంటీనాలో అత్యంత అరుదైన కేసుల్లోనే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్టు తేలిందని, హంటావైరస్ సోకిన వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది.

అమెరికాలో కరోనా కల్లోలం, ఒక్కరోజులోనే 10 వేల కొత్త కేసులు

వైరస్ సోకినవారిలో హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్(హెచ్‌పీఎస్) రోగుల మాదిరిగానే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, మైకం, విరేచనాలు, ఉదర సంబంధ లక్షణాలు ఉంటాయి. అలాగే, వైరస్ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఊపిరితిత్తులు కఫంతో నిండిపోయి, శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. హంటావైరస్‌ను ఆండీస్ వైరస్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఎలుకల ద్వారా సంక్రమిస్తుందని, దీని గురించి భయపడాల్సిన అవసరంలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది.

హంటా వైరస్‌ వల్ల వచ్చే జ్వరం ప్రాణాంతకం కాదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. కొన్నేళ్ల కిందట అమెరికాలోని హంటా నదీ తీరంలో సైనికులు గుడారాలు వేసుకున్నారు. అక్కడ ఎలుకలు ఎక్కువగా ఉన్నందున వాటి ద్వారా వచ్చిన వైరస్‌ సైనికులకు సంక్రమించింది. దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వీరినిన పరీక్షించిన వైద్యులు.. ఎలుకల నుంచి వచ్చిన వైరస్ కారణంగా వ్యాధి ప్రబలిందని నిర్ధారించారు. అందువల్ల దానికి హంటావైరస్‌ అని పేరు వచ్చింది.

(The above story first appeared on LatestLY on Mar 26, 2020 08:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).