Prince Charles, Prince of Wales. (Photo Credits: PTI)

London, March 25: కరోనా (Coronavirus) మహమ్మారి సెగ బ్రిటన్‌ రాజకుటుంబాన్ని తాకింది.బ్రిటన్ రాజవంశంలో తొలి కరోనా కేసు నమోదైంది. బ్రిటన్ రాణి తరువాత సింహాసనాన్ని అధిరోహించబోయే ప్రిన్స్‌ చార్లెస్‌(71)కు (Prince Charles) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ప్రిన్స్‌ చార్లెస్‌ (Prince Charles Tests Positive for Coronavirus) ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన స్కాట్‌ల్యాండ్‌లోని తన నివాసంలో స్వీయ నిర్భందంలో ఉన్నారని క్లారెన్స్‌ హౌస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, చార్లెస్‌ భార్య కమిల్లాకు కరోనా నెగటివ్‌ వచ్చిందన్నారు.

అమెరికాలో కరోనా కల్లోలం, ఒక్కరోజులోనే 10 వేల కొత్త కేసులు

ఇటీవల చార్ల్స్ అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, కాబట్టి ఏ సందర్భంలో ఆయనకు కరోనా సోకి ఉండచ్చో కచ్చితంగా చెప్పలేమని అధికారులు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు.. భార్య భర్తలిద్దరూ ప్రస్తుతం స్కాట్ ల్యాండ్‌లో సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉన్నారని సమచారం. ఈ విషయంలో మరింత సమాచారం రావాల్సి ఉంది. మరోవైపు బ్రిటన్‌లో ఇప్పటివరకు 8077 కేసులు నమోదు కాగా.. 422 మంది మృత్యువాతపడ్డారు.

Here's ANI Tweet

కరోనా క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని బోరిన్‌ జాన్సన్‌ ప్రకటించారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రజలు అత్యసవరమైతే తప్ప గడప దాటి బయటకు రావొద్దని ఆదేశించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే కరోనాను ఓడించగలమని పిలుపునిచ్చారు.

ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం

ఇదిలా ఉంటే తనకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి, ఎంపీ నదిన్‌ డారీస్‌ స్వయంగా వెల్లడించారు. మంత్రి ప్రకటనతో సీనియర్‌ అధికారులూ పెద్దసంఖ్యలో కరోనా బారిన పడి ఉంటారని భావిస్తున్నారు. తనకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని, ఇంటిలో ఒంటరిగా ఉన్నానని కన్జర్వేటివ్‌ ఎంపీ డారీస్‌ పేర్కొన్నారు. కొవిడ్‌-19 బారిన పడిన తొలి బ్రిటన్‌ రాజకీయ నేత డారిస్‌ కావడం గమనార్హం.