COVID-19 Deaths In Italy: ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం, ఒక్కరోజే 627 మంది కరోనాకు బలి, చైనాను అధిగమించిన ఇటలీ
Coronavirus Outbreak in Italy. (Photo Credits: AFP)

Rome, March 21: చైనాలో (China) పుట్టి ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ (Coronavirus) ప్రపంచదేశాలను నిర్భంధంలోకి నెట్టివేసింది.చైనాలో 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి 3,248 మంది చనిపోయారు. అయితే ఇప్పుడు ఇటలీ (Italy) కరోనా దెబ్బకు చావు అంచుల్లోకి వెళ్లింది. ఆ దేశంలో చావులు (COVID-19 Deaths In Italy) చైనాను మించిపోయాయి.

కనికా కపూర్‌కు కరోనా, కరోనా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకున్న ఎంపీలు

ఇటలీలో 41,035 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 3,405 మంది మరణించారు. దీంతో కరోనా మృతులలో చైనాకు ఉన్న రికార్డును ఇటలీ సొంతం చేసుకుంది. ఈ వివరాలను ఆ దేశ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

పళనిస్వామి సర్కార్ కీలక నిర్ణయం, ఏపీ, కేరళ, కర్ణాటక నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేత

కరోనాను కట్టడి చేయడం ఇప్పుడు ఆ దేశానికి పెను సవాల్ గా నిలిచింది. పరిస్థితి పూర్తిగా చేజారి పోవడంతో... ఆ దేశ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి జారిపోయింది. అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

ఇటలీ ఒక్క రోజులో 475 కన్నా ఎక్కువ మరణాలను నమోదు చేయలేదు, అయితే నిన్న ఒక్కరోజే 627 మంది కరోనా భారీన పడి చనిపోయారు. చైన 150 కన్నా ఎక్కువ సంఖ్యను ఇప్పటిదాకా నివేదించలేదు. అయితే ఇటలీ మాత్రం కరోనా దెబ్బకు కకావికలమవుతోంది. ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య 41,035 నుంచి 47,021 కు పెరిగిందని, ఇది 14.6% పెరిగిందని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది.

2,549 మరణాలు మరియు 22,264 కేసులతో లోంబార్డి ఉత్తర ప్రాంతం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ దేశవ్యాప్తంగా మొదట సోకిన వారిలో, 5,129 మంది శుక్రవారం పూర్తిగా కోలుకున్నారు, అంతకు ముందు రోజు ఈ సంఖ్య 4,440 గా మాత్రమే ఉంది. అంతేకాదు మొదట సోకినా వారిలో 2,655 మంది ఇంటెన్సివ్ కేర్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు నివేదికలు వెలువడ్డాయి.

తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్‌లో 3

ఇక ఇటలీ తర్వాత కరోనా వల్ల ఇబ్బందిపడుతున్న మరోదేశం ఇరాన్. అక్కడ 18,407 కేసులు నమోదుకాగా.. 1284 మంది చనిపోయారు. కరోనా కేసులు ఘడియ ఘడియకు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 26వేల కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా కేసులు 258 నమోదుకాగా.. ఇప్పటివరకు అయిదుగురు చనిపోయారు.

ఐరోపా ఖండంలో మరణించిన వారి సంఖ్య 5,000 దాటింది, ఈ ఖండంలో అధిక మరణాలు ఇటలీ, స్పెయిన్ మరియు జర్మనీ లో ఉన్నాయి. ఇక్కడ కేసులు కూడా అధికంగానే ఉన్నాయి. స్పెయిన్ మరణాల సంఖ్య కూడా 1,000 కు పెరిగింది, ఇరాన్లో 1,400 కన్నా ఎక్కువ ఉంది.

ఇదిలావుంటే ప్రపంచ వ్యాప్తంగా 235,000 మంది ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారని, 11,000 మందికి పైగా చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ కంట్రోల్ లోనే ఉందని ఆ దేశ ఆరోగ్య కేంద్రాలు స్పష్టం చేస్తున్నాయి.. కొత్త కేసులు కూడా పెద్దగా నమోదవడం కావడం లేదని వెల్లడిస్తోంది.