Chennai, Mar 21: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus scare) పంజా విసురుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు ఆంక్షలు విధిస్తున్నాయి. రేపు ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ (Janata Curfew) పాటించాలని దేశ ప్రజలకు సూచించిన సంగతి విదితమే. కాగా కరోనా కట్టడికి తమిళనాడు సర్కార్ (Tamil Nadu Govt) కీలక నిర్ణయం తీసుకుంది.
కనికా కపూర్‌కు కరోనా, కరోనా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్న ఎంపీలు
ఇందులో భాగంగా సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (AP), కర్ణాటక, కేరళ(Kerala) నుంచి వాహనాల రాకపోకలను ఈ నెల 31 వరకు నిలిపి వేయాలని (Tamil Nadu Borders Closed) నిర్ణయించింది. అయితే నిత్యావసర వస్తువులు, అత్యవసర వైద్య సేవల వాహనాలను మాత్రం అనుమతిస్తారు.
కరోనాను కట్టుదిట్టం చేసేందుకు కఠిన చర్యలను తీసుకోవాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రులతో మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్ పాల్గొన్నారు.
ప్రధానితో (PM Modi) వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దులను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారి కోసం అతి తక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతామని తెలిపింది. దేశ, రాష్ట్ర సంక్షేమం కోసం తాము తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా సహకరించాలని పళనిస్వామి కోరారు.