India Rejects Canadian Report: హర్దీప్ నిజ్జర్ హత్యతో విదేశాలకు సంబంధం లేదు, ఎన్నికల ప్రకియలో జోక్యం ఉందని కెనడా ప్రభుత్వ నివేదిక, ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం
దీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది. అయినప్పటికీ ఈ హత్యతో విదేశాలకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుందని పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్.. కమిషన్ నివేదికను తోసిపుచ్చింది.
New Delhi, JAN 29: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ (Nijjar Murder) హత్య కేసుకు సంబంధించి కెనడా ప్రభుత్వం (Canada Govt) ఏర్పాటు చేసిన కమిషన్ కీలక విషయం వెల్లడించింది. నిజ్జర్ హత్య కేసుకు విదేశాలతో కచ్చితమైన సంబంధం ఉన్నట్లు తేలలేదని పేర్కొంది. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) గతంలో చేసిన ఆరోపణల తర్వాత అసత్య ప్రచారాలు జరిగాయని, ఈ క్రమంలోనే ఈ ఆరోపణలను చూడాలని వెల్లడించింది. విదేశంతో సంబంధమున్నట్లు నిరూపితం కాలేదని తెలిపింది.
‘కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య సంస్థల్లో విదేశీ జోక్యం’ అంశంపై మేరీ-జోసీ హోగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ తాజాగా నివేదిక రూపొందించింది. ఇందులో నిజ్జర్ హత్య కేసును ప్రస్తావించిన కమిషన్.. దీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది. అయినప్పటికీ ఈ హత్యతో విదేశాలకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుందని పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్.. కమిషన్ నివేదికను తోసిపుచ్చింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ కెనడా వాంకోవర్‌లో 2023 జూన్ 18న హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందని, ఇందుకు సంబంధించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటన్నింటిని భారత్ తోసిపుచ్చింది. అనంతరం దౌత్యవేత్తల బహిష్కరణతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి.
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 11:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

