Kush Desai (Credits: X)

Newyork, Jan 25: భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు కుశ్ దేశాయ్‌ (Kush Desai)ని వైట్‌ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ (Trump) నియ‌మించారు. ఈ విష‌యాన్ని శ్వేత‌సౌధం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. గ‌తంలో కుశ్ దేశాయ్‌.. 2024 రిప‌బ్లిక‌న్ నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌, ఐయోవా రిప‌బ్లిక‌న్ పార్టీ క‌మ్యూనికేష‌న్స్ డైరెక్ట‌ర్‌ గా చేశారు. పెన్సిల్వేనియాకు కూడా డిప్యూటీ డైరెక్ట‌ర్‌ గా విధులు నిర్వహించారు. అమెరికాలోని కీల‌క‌మైన రాష్ట్రాల్లో మీడియా కార్య‌ద‌ర్శిగా కుశ్ దేశాయ్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు వైట్‌హౌజ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

 

ఇప్పటికే మనోళ్లు..

ట్రంప్ 2.0 కేబినెట్ లో ఇప్పటికే భారత మూలాలున్న ఇద్దరు తులసి గబ్బార్డ్, వివేక్ రామస్వామి ఉండగా.. తాజాగా ట్రంప్ కేబినెట్ లో కాష్ పటేల్ (44) అనే ఇండియన్ అమెరికన్ చేరారు. భారత దేశంలోని గుజరాత్ మూలాలున్న కాష్ పటేల్‌ కు ట్రంప్ ఎఫ్‌బిఐ డైరెక్టర్ పదవి కట్టబెట్టారు.

కేసీఆర్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు