Road Accident (Credits: X)

Hyderabad, Jan 25: హైదరాబాద్ (Hyderabad) లోని బంజారాహిల్స్‌ లో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్‌ పాత్‌ పైకి దీసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేసీఆర్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు

ప్రమాదం తర్వాత పరారీ

ప్రమాదం అనంతరం కారులోని వ్యక్తులు ఆ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. దీంతో కారు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా యజమానిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్రమాదం జరిగిన విధానాన్ని విశ్లేషించనున్నారు.

వ్యవసాయం చేసుకుంటానంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాని వెల్లడి