Hyderabad, Jan 25: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన సోదరి చీటి సకలమ్మ (82) (Cheeti Sakalamma) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ కు సకలమ్మ ఐదో సోదరి. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న వెంటనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. జరుగాల్సిన కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు.
అనారోగ్యంతో కేసీఆర్ ఐదవ సోదరి చీటీ సకలమ్మ కన్నుమూత pic.twitter.com/5Gfzry0hwD
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2025
నేడు అంత్యక్రియలు
సకలమ్మ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు సమాచారం. సకలమ్మ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. భర్త హన్మంతరావు కొన్నేండ్ల క్రితమే మృతిచెందారు. వారికి ముగ్గురు సంతానం. అందరూ కుమారులే.