Malaysia Crime: సె*క్స్ కావాలని ప్రియురాలిని కత్తితో బెదిరించిన యువకుడు.. అదే కత్తితో 28 సార్లు ప్రియుడిని పొడిచిన లవర్.. 12 ఏళ్లు జైలు శిక్ష విధించిన మలేషియా కోర్టు..

ఈ శిక్ష నేరం యొక్క తీవ్రతకు తగినట్లుగా లేదని వాదిస్తూ ప్రాసిక్యూషన్ వేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల అప్పీల్ ప్యానెల్, ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించింది. బెంచ్ సభ్యుడైన న్యాయమూర్తి ఎవ్రోల్ మరియెట్ పీటర్స్ మాట్లాడుతూ, షై చేసిన ఘోరమైన చర్యను పక్కనపెట్టి, ఆమె వయస్సుకు హైకోర్టు అతిగా ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు

Representative Image of Jail (Photo Credits: Pixabay)

Malaysia Crime: లైంగిక వాంఛ తీర్చమని ఒత్తిడి చేసిన ప్రియుడిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన కేసులో మలేషియా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో విచారణ జరిపిన అప్పీల్ కోర్టు, నిందితురాలికి గతంలో కింది కోర్టు విధించిన జైలు శిక్షను దాదాపు రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టు నిందితురాలి పట్ల "మితిమీరిన సానుభూతి" చూపించిందని వ్యాఖ్యానించిన అప్పీల్ కోర్టు, ఆమె జైలు శిక్షను 6.5 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు పెంచుతూ మంగళవారం తీర్పునిచ్చిందని 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' (SCMP) వెల్లడించింది.

ఉపాధ్యాయుడితో స్టూటెంట్ రాసలీలలు వీడియో వైరల్.. ఇది నిజం కాదని MMS స్కాండల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హచ్చరిక..

కోర్టు పత్రాల ప్రకారం నిందితురాలు షై (22, ఆమె ప్రియుడు (29) సెప్టెంబర్ 20, 2022న జోహోర్ బహ్రూలోని ఒక హోటల్ గదిలో బస చేశారు. ఆ సమయంలో ప్రియుడు లైంగిక సంబంధం కోరగా.. తనకు నెలసరి అని చెబుతూ షై నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అతడు కత్తితో బెదిరించగా, వారిద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఆ క్రమంలో అతని చేతిలోని కత్తిని లాక్కున్న షై, అతని ఛాతీపై దారుణంగా దాడి చేసింది. శవపరీక్ష నివేదికలో బాధితుడి శరీరంపై ఏకంగా 28 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. మొదట హత్య కేసు నమోదైనప్పటికీ, న్యాయవాది విజ్ఞప్తితో దానిని నేరపూరిత నరహత్యగా సవరించగా.. జోహోర్ బహ్రు హైకోర్టు ఆమెకు 6.5 ఏళ్ల శిక్ష విధించింది.

ఈ శిక్ష నేరం యొక్క తీవ్రతకు తగినట్లుగా లేదని వాదిస్తూ ప్రాసిక్యూషన్ వేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల అప్పీల్ ప్యానెల్, ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించింది. బెంచ్ సభ్యుడైన న్యాయమూర్తి ఎవ్రోల్ మరియెట్ పీటర్స్ మాట్లాడుతూ, షై చేసిన ఘోరమైన చర్యను పక్కనపెట్టి, ఆమె వయస్సుకు హైకోర్టు అతిగా ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. శిక్ష పడే సమయానికి ఆమె వయస్సు 22 ఏళ్లు దాటడంతో యువ నేరస్థురాలి హోదాను వర్తింపజేయలేమని స్పష్టం చేశారు. 28 సార్లు కత్తితో పొడవడాన్ని కేవలం ఆవేశంలో చేసిన ఒకే ఒక్క చర్యగా చూడలేమని.. నేరం యొక్క తీవ్రతకు తగ్గట్టుగా 12 ఏళ్ల కఠిన జైలు శిక్ష సరిపోతుందని తీర్పునిచ్చింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement