Mariana Fabiola get Married: అవును ఆ ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు! రహస్య డేటింగ్ తర్వాత ఒక్కటైన మిస్ అర్జెంటీనా, మిస్ ప్యూర్టోరికో, సోషల్ మీడియాలో రొమాంటిక్ వీడియోను పోస్ట్ చేసిన అందాల భామలు
ఈ జంట బీచ్‌లో రొమాంటిక్ బంగిమలు, కౌగిలింతలు, షాంపైన్ టోస్ట్‌లు, బంగారం, వెండి కలర్ బెలూన్‌లతో “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అనే అర్థంతో సహా వారి సంబంధానికి సంబంధించిన క్షణాలను చూపించే ఇన్‌స్టాగ్రామ్ లో (Instagram) వీడియోలను పోస్ట్ చేశారు.
Argentina, NOV 03: మాజీ మిస్ అర్జెంటీనా (Miss Argentina ), మాజీ మిస్ ప్యూర్టో రికో (Miss Puerto Rico) వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. 2020 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలలో ఇద్దరు పోటీదారులు. మరియానా వరెలా (Mariana Varela), ఫాబియోలా వాలెంటిన్ (Fabiola Valentin)గా నిలిచారు. అయితే ఈవారం తాము సంబంధంలో ఉన్నామని, ఇటీవలే వివాహం చేసుకున్నామని (get married) వారు తెలిపారు. థాయిలాండ్‌లో 2020 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో మరియానా వరెలా, ఫాబియోలా వాలెంటిన్ కలుసుకున్నారు. అక్కడ వారు వరుసగా అర్జెంటీనా, ప్యూర్టో రికోలకు ప్రాతినిధ్యం వహించారు. పోటీలో టాప్ 10లో స్థానం సంపాదించిన తర్వాత ఆ ఇద్దరు అందాల భామలు సోషల్ మీడియాలో సన్నిహిత స్నేహితులుగా మెలిగారు. బయట ప్రపంచానికి తెలియకుండా వారు గతకొంతకాలంగా రహస్యంగా డేటింగ్ చేస్తూవచ్చారు.
View this post on Instagram
ఈ జంట బీచ్‌లో రొమాంటిక్ బంగిమలు, కౌగిలింతలు, షాంపైన్ టోస్ట్‌లు, బంగారం, వెండి కలర్ బెలూన్‌లతో “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అనే అర్థంతో సహా వారి సంబంధానికి సంబంధించిన క్షణాలను చూపించే ఇన్‌స్టాగ్రామ్ లో (Instagram) వీడియోలను పోస్ట్ చేశారు. అయితే, వారు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టుచేసిన ఫొటోలలో ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లోని సిటీ కోర్ట్‌హౌస్ వెలుపల ఈ జంట ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 28న వారు వివాహం చేసుకున్నారు.
ఈ విషయాన్ని తెలుపుతూ.. మా సంబంధాన్ని ప్రైవేట్‌గా ఉంచాలని నిర్ణయించుకున్న తర్వాత మేము ఒక ప్రత్యేక రోజున తలుపులు తెరిచాము అనే క్యాప్షన్ స్పానిష్‌లో రాసిఉంది. అయితే, చాలామంది వారి అభిమానులు, సెలబ్రిటీలు వారేలా, వాలెంటైన్‌ల చిత్రమైన ప్రేమను అభినందించారు
(The above story first appeared on LatestLY on Nov 03, 2022 11:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

