Monkeypox Outbreak: కరోనా తర్వాత వణికిస్తున్న మరో వైరస్, మరోసారి 21 రోజులు హోం క్వారంటైన్‌లోకి ప్రజలు, మంకిపాక్స్‌ బాధితులకు క్వారంటైన్‌ అమలుచేస్తున్న తొలి దేశంగా బ్రెజిల్

కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో మరో వైరస్‌ భయాందోళనలకు గురిచేస్తున్నది. ఆఫ్రికన్‌ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వైరస్‌ (Monkeypox Outbreak) వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. దీంతో మరోసారి జనాలు ఇండ్లకు పరిమితమయ్యేలా చేస్తున్నది.

Monkeypox Outbreak: కరోనా తర్వాత వణికిస్తున్న మరో వైరస్, మరోసారి 21 రోజులు హోం క్వారంటైన్‌లోకి ప్రజలు, మంకిపాక్స్‌ బాధితులకు క్వారంటైన్‌ అమలుచేస్తున్న తొలి దేశంగా బ్రెజిల్
Monkeypox (Pic Credit: Twitter)

Brussels [Belgium], May 23: కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో మరో వైరస్‌ భయాందోళనలకు గురిచేస్తున్నది. ఆఫ్రికన్‌ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వైరస్‌ (Monkeypox Outbreak) వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. దీంతో మరోసారి జనాలు ఇండ్లకు పరిమితమయ్యేలా చేస్తున్నది. యూరోపియన్‌ దేశమైన బెల్జియంలో (Belgium) మంకీపాక్స్‌ కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. వైరస్‌ సోకినవారికి 21 రోజుల క్వారంటైన్‌ (21-Day Mandatory Quarantine ) తప్పనిసరి చేసింది. దీంతో మంకిపాక్స్‌ బాధితులకు క్వారంటైన్‌ అమలుచేస్తున్న తొలి దేశంగా (Belgium Becomes First Country ) నిలిచింది.

బ్రెజిల్ దేశంలో ఇప్పటివరకు 14 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఓడరేవు పట్టణమైన అన్ట్‌వెర్ప్‌లో మొదటిసారిగా మంకీపాక్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది. అన్ని కేసులు ఆ పట్టణంతోనే ముడిపడి ఉన్నాయని, బాధితులంతా అన్ట్‌వెర్ప్‌లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా పాజిటివ్‌ వచ్చినవారికి 21 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ దేశాలను మంకీపాక్స్‌ వణికిస్తున్నది. 12 దేశాల్లో ఈ తరహా కేసులు వెలుగు చూశాయని, ఇప్పటివరకు 80 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఐరోపాలోనే 20 మందికి వైరస్‌ సోకిందని తెలిపింది.

గే, బైసెక్సువల్‌ సెక్స్ చేసే వారి ద్వారా మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి, పురుషుడితో మరో పురుషుడు సెక్స్ చేసేవారిలో మంకీపాక్స్‌ లక్షణాలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా సీడీసీ

తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌ల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగులోకి వచ్చినట్టుగా నిర్ధారించాయి. కేవలం 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100 పైగా కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది. భారత్‌ కూడా ఈ వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తమైంది. వైరస్‌ విస్తరిస్తున్న తీరుని పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్‌ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికాలలో చాపకింద నీరులా విస్తరిస్తోంది.

అమెరికాలో తొలి మంకీపాక్స్ కేసు, వ్యాధి సోకిన వ్య‌క్తి శ‌రీరాన్ని తాకితే ఈ వైరస్ వచ్చేస్తుంది, మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు ఇవే, సెక్స్ వ‌ర్క‌ర్ల ద్వారా ఎక్కువగా వ్యాప్తి

ఏమిటీ మంకీపాక్స్‌?:

స్మాల్‌ పాక్స్‌ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్‌ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్‌ కనిపించింది.

లక్షణాలివే..:

జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది.

ఎలా వ్యాపిస్తుంది?:

తుంపర్ల ద్వారా, మంకీపాక్స్‌ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా సోకుతుంది.

చికిత్స ఎలా?:

ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్‌ డ్రగ్స్‌ వాడతారు. స్మాల్‌ పాక్స్‌ వ్యాక్సిన్‌ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు.

(The above story first appeared on LatestLY on May 23, 2022 02:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).