Boston (Massachusetts) [US], May 19: కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాలో మంకీపాక్స్ వైరస్ కేసు (Monkeypox in US) నమోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ (CDC) ఈ కేసును ద్రువీకరించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తి ఇటీవల కెనడాలో పర్యటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో చేర్పించారు.
కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మంకీపాక్స్‌ను సీరియస్ వైరస్ కేసుగా (Confirm First Case of Infection in 2022) భావిస్తున్నారు. ఫ్లూ లాంటి లక్షణాలతో అస్వస్థత ప్రారంభం అవుతుంది. జ్వరం, వళ్లు నొప్పులు, శరీరంపై అమ్మవారు మచ్చలు వ్యాపిస్తాయి. కెనడాలోని మాంట్రియల్‌లో ఆరోగ్యశాఖ అధికారులు 13 మంకీపాక్స్ కేసులను విచారిస్తున్నారు. శరీర ద్రవాలు కలవడం వల్ల మంకీపాక్స్ సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన వ్యక్తి శరీరాన్ని తాకినా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి (Monkeypox) సోకిన వ్యక్తి దుస్తులు వేసుకున్నాఆ వైరస్ ప్రబలే ఛాన్సు ఉంది. ఇటీవల యురోప్‌లోనూ మంకీపాక్స్ కేసులు ఎక్కువయ్యాయి. పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్‌లో ఈ కేసుల్ని ఎక్కువగా గుర్తించారు. ఈ వ్యాధి ఎక్కువగా సెక్స్ వర్కర్ల ద్వారా వ్యాపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు ఇవీ
అర్థో పాక్స్ వైరస్ కటుంబానికి చెందినదే మంకీ పాక్స్ వైరస్. 1958లో తొలిసారిగా దీన్ని గుర్తించారు. స్మాల్ పాక్స్ తెలుసుకదా అది కూడా ఈ కుటుంబానిదే. స్మాల్ పాక్స్ లో కంటే మంకీ పాక్స్ లో లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. స్మాల్ పాక్స్ ను 1980ల్లోనే టీకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించగలిగారు. కానీ, మంకీ పాక్స్ ఇప్పటికీ పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికా దేశాల్లో మనుగడలో ఉంది.
లక్షణాలు..
మంకీ పాక్స్ వైరస్ ను చర్మంపై ర్యాషెస్ రూపంలో గుర్తించొచ్చు. బొబ్బల మాదిరిగా (కణుపులు మాదిరి) చర్మం అంతటా పాకొచ్చు. ఫ్లూ మాదిరి లక్షణాలు కూడా ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, కండరాల నొప్పులు కనిపిస్తాయి.
తేడా..
మంకీ పాక్స్ వైరస్ లో బొబ్బలు (కణుపులు) కనిపిస్తాయి. అదే స్మాల్ పాక్స్ లో ఇవి ఉండవు.
వ్యాప్తి
సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. జంతువులు, మనుషుల నుంచి ఇది వ్యాపించొచ్చు. ఎలుకలే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకాలుగా ఉంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం.. శరీర ద్రవాలు, చర్మంపై పుండ్ల ద్వారా, నోటిలోని ద్రవాల నుంచి, శ్వాస తుంపర్ల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా సెక్స్ వర్కర్ల ద్వారా వ్యాపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు