Prison Riot in Honduras: జైలులో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు, 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతి, మొత్తం 41 మంది మహిళా ఖైదీలు మృతి

సెంట్రల్ అమెరికా (Honduran President)లోని హోండురస్ (Honduras)లో రెండు గ్రూపుల మధ్య అల్లర్ల ఘటన చోటు చేసుకుంది. హోండురస్ రాజధాని తెగుసిగల్పాకు (Tegucigalpa) వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమారా మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది మహిళా ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు

Prison Riot in Honduras: జైలులో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు, 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతి, మొత్తం 41 మంది మహిళా ఖైదీలు మృతి
Representative Image (Photo Credit- Pixabay)

సెంట్రల్ అమెరికా (Honduran President)లోని హోండురస్ (Honduras)లో రెండు గ్రూపుల మధ్య  అల్లర్ల ఘటన చోటు చేసుకుంది. హోండురస్ రాజధాని తెగుసిగల్పాకు (Tegucigalpa) వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమారా మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది మహిళా ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో సుమారు 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మంది బుల్లెట్ గాయాలు, కత్తిపోట్లకు గురి కాగా వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వారు తెగుసిగల్పా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జైలులో ఉన్న రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న గొడవే ఈ మారణహోమానికి కారణమని తెలుస్తోంది.

ANI Tweet

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 21, 2023 12:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).