Serbia: 5వ భర్త బద్దకంగా ఉన్నాడని..అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన భార్య, ఆ ముక్కలతో కడాయిలో కూర చేసిన కసాయి, ఇంట్లో ఉన్న దృశ్యాలను చూసి షాక్ తిన్న పోలీసులు

సెర్బియాలోని జ్రెంజనిన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భర్తకు బద్ధకం ఎక్కువైందని, పనిలో సాయం చేయడం లేదన్న కోపంతో అతడిని (Wife Kills Husband) చంపేసింది. అంతటితో ఆగకుండా భర్త మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటితో కూర వండేసింది.

Srdjan Peric with wife Tereza Peric (Image: @srdjan.peric.906/Newsflash)

Serbia, May 13: సెర్బియాలోని జ్రెంజనిన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భర్తకు బద్ధకం ఎక్కువైందని, పనిలో సాయం చేయడం లేదన్న కోపంతో అతడిని (Wife Kills Husband) చంపేసింది. అంతటితో ఆగకుండా భర్త మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటితో కూర వండేసింది. ఈ దారుణ ఘటన వివరాల్లోకెలితే.. సెర్బియా (Serbia)లోని జ్రెంజనిన్‌కు చెందిన సర్జాన్ పెరిక్ (Srdjan Peric), థెరెస్సా పెరిక్ భార్యా భర్తలు. థెరెస్సాకు (Teresa Peric) పెరిక్‌కు ఇతడు ఐదో భర్త. నలుగురు భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె సర్జాన్‌ను పెళ్లి చేసుకుంది. కాగా నలుగురు భర్తలతో వారి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే సర్జాన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు

పెళ్లయ్యాక రెండేళ్ల వరకు వీరి కాపురం బాగానే ఉంది. ఆ తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. సర్జాన్ పెరిక్ ఏ పనిచేసే వాడు కాదని.. సోమరితనంతో ఎప్పుడూ మంచంపైనే గడుపుతాడని.. థెరెస్సా అప్పుడప్పుడూ అతనితో కొట్లాటకు దిగేది. ఈ క్రమంలో ఇరువురి మధ్య నిత్య గొడవలు జరిగేవి. అతడి బద్ధకంతో విసిగిపోయిన సర్జాన్ పెరిక్ మే 10న రాత్రి సమయంలో భర్త సర్జాన్‌పై దాడి చేసి చంపేసింది. డ్రగ్స్ మత్తులో ఉన్న అతడిని కత్తితో పొడిచిం కసిదీరా చంపేసింది.

ప్రియురాలిని చీకట్లో కలిసేందుకు ఊరి మొత్తానికి కరెంట్ కట్ చేశాడు, గ్రామస్థులకు తెలియడంతో చితకబాది ఇద్దరికీ పెళ్లి చేశారు, బీహార్‌లో ఆసక్తికర ఘటన

సర్జాన్‌ను థెరెస్సా చంపుతుండగా ఆమె కూతురు డి.ఎల్జే స్వయంగా చూసింది. ఆ దృశ్యాన్ని చూసి వెంటనే తన సోదరుడికి వద్దకు పరుగెత్తికెళ్లింది డి.ఎల్జే. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫోన్ చేద్దామనుకున్నారు. కానీ అదే సమయంలో గది నుంచి రంపంతో కోస్తున్న శబ్ధాలు రావడంతో భయపడిపోయి అక్కడ ఉండిపోయారు. ఆ తర్వాత సర్జాన్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది. అనంతరం వాటిని పెద్ద ప్యాన్‌లో ఉంచి.. కూర వండేసింది. పక్కింట్లో ఏదే జరుగుతోందని గ్రహించి.. ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చీకట్లో వధువు చెల్లికి తాళి కట్టేసిన వరుడు, కరెంట్ వచ్చాక చూసి బిత్తరపోయిన వధువు తల్లిదండ్రులు, మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయం

పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో ఉన్న దృశ్యాలను చూసి షాక్ తిన్నారు. అనంతరం థెర్సాను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్జాన్ పెరిక్‌ను చంపడం తాను కళ్లారా చూశానని..డి.ఎల్జే వాంగ్మూలం ఇచ్చింది. భార్యా భర్తలు నిత్యం గొడవ పడేవారని భర్త నిద్రపోతున్నాడన్న కోపంతో ఓసారి బెడ్‌ను కూడా తగులబెట్టినట్లు ఇరుగుపొరుగు వారు చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement