South Africa Shocker: షాకింగ్ న్యూస్.. నైట్ క్లబ్‌లో చెల్లా చెదురుగా 17 శవాలు, మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేదని తెలిపిన పోలీసులు, దక్షిణాఫ్రికాలో మిస్టరీగా మారిన కేసు
దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో 17 మృతదేహాలు పడివుండడం తీవ్ర కలకలం (South Africa Shocker) రేపింది. ఈస్ట్ లండన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మృతదేహాలన్నీ చెల్లా చెదురుగా క్లబ్ లోని వివిధ ప్రదేశాల్లో (17 People Found Dead in Nightclub ) పడి ఉండగా, మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేదు.
దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో 17 మృతదేహాలు పడివుండడం తీవ్ర కలకలం (South Africa Shocker) రేపింది. ఈస్ట్ లండన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మృతదేహాలన్నీ చెల్లా చెదురుగా క్లబ్ లోని వివిధ ప్రదేశాల్లో (17 People Found Dead in Nightclub ) పడి ఉండగా, మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేదు. దాంతో వారు ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది. ఈస్ట్ లండన్ లోని సీనరీ పార్క్ లో ఈ నైట్ క్లబ్ ఉంది. ఆదివారం వేకువజామున మృతదేహాల సంగతి బయటికి పొక్కడంతో తీవ్ర కలకలం చెలరేగింది. యూపీలో దారుణం, మాజీ భార్య చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు, సీసీటీవీ పుటేజీ వీడియో వైరల్
పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. దీనిపై ఓ పోలీసు అధికారి స్పందిస్తూ, తాము పుకార్లను నమ్మదలుచుకోలేదని, ఇంతమంది ఎలా మరణించారన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కాగా, మృతదేహాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయితే వారి మరణానికి నిర్దిష్ట కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.
(The above story first appeared on LatestLY on Jun 27, 2022 12:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

