Bolivia, AUG 27: స్కూల్ టీచర్ తన విద్యార్థులకు చెప్పిన హోమ్‌వర్క్ (Home work) వివాదాస్పదం అయింది. వీర్యంతో కూడిన కండోమ్‌లను (Condoms With Their Semen) తరగతిగదికి తీసుకురావాలంటూ ఆమె చెప్పిన హోమ్‌వర్క్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియా వరకూ చేరడంతో రచ్చ మొదలైంది. ఫలితంగా ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో హైస్కూల్ విద్యార్థులకు అలా హోమ్‌వర్క్ (Home work) ఇవ్వడం వెనక ఉన్న ఆమె ఉద్దేశం ఏంటి? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఆమెరికాలోని దేశమైన బోల్వియా(Bolivia)కు చెందిన మరియా ఐనెస్ అనే మహిళ.. ఓ హైస్కూల్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ (Sex Education Teacher) గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తరగతి విద్యార్థులకు ఆమె తాజాగా వినూత్న టాస్క్ ఇచ్చారు.
వీర్యంతో కూడిన కండోమ్(Condoms Filled With Semen)లను తీసుకుని స్కూల్‌కు రావాల్సిందిగా హోమ్‌వర్క్ ఇచ్చారు. అది తెలిసి.. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. విషయం మీడియాకు లీక్ కావడంతో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఆమెను ఉద్యోగం నుంచి తొలిగించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తేమతో కూడిన వాతావరణంలో వీర్య కణాలు ఎంత కాలంపాటు జీవించగలవు అనే విషయాన్ని ప్రాక్టికల్‌గా విద్యార్థులకు చెప్పడంతోపాటు విద్యార్థులు దానికి దూరంగా ఉండాలని సూచించేందుకే ఆ హోమ్‌వర్క్ ఇచ్చినట్టు చెప్పారు.
అయితే.. తాను ఇచ్చిన హోమ్‌వర్క్‌ను కచ్చితంగా చేయాల్సిందేనని విద్యార్థులను ఆదేశించలేదన్నారు. తానూ నలుగురు పిల్లలకు తల్లినని ఈ సందర్భంగా చెప్పిన ఆమె.. తన సూచనల వెనక ఎటువంటి తప్పుడు ఆలోచనా లేదని స్పష్టం చేశారు. అయినా.. తన వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే క్షమించాలని కోరారు.