Japan, AUG 28: జపాన్ శాస్త్రవేత్తలు పురుషుడి పురుషాంగ పరిమాణాన్ని (penis size) ముక్కుతో (Nose) అంచనా వేయవచ్చంటూ ఓ అధ్యయనంలో తేల్చారు. 30 నుంచి 50ఏళ్ల వయస్సు కలిగిన 126 మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరి పరిశోధనలో ముక్కుకు పురుషాంగ పరిమాణానికి (Penis size) పోలిక ఉందని, ముక్కు పొడవు ఎంతఉంటే పురుషుడి పురుషాంగ పరిమాణం కూడా అంతే ఉంటుందని అన్నారు. అయితే ఇదిపక్కా అని చెప్పడానికి ఇంకా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని జపాన్ శాస్త్రవేత్తలు (japan Scientists) తెలిపారు. 1971లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. పురాతన రోమన్ సమాజంలో ముక్కు పొడవు పురుషాంగ పరిమాణానికి సూచికగా పరిగణించేవారట. వ్యక్తి ముక్కు పరిమాణంపైనే అంగపరిమాణం ఆధారపడి ఉంటుందని అప్పట్లో వారు నమ్మేవారట. అప్పట్లో అక్రమసంబంధాలు పెట్టుకునే వాళ్లను, లైంగిక వేధింపులు పాల్పడే వారి ముక్కులు కోసి శిక్షించేవారట.
అయినప్పటికీ ముక్కు పరిమాణం, పురుషాంగం మధ్య సంబంధం గత సంవత్సరం వరకు శాస్త్రీయంగా నిరూపించబడలేదు. జపనీస్ పరిశోధకుల బృందం వారి అధ్యయనంలో పెద్ద ముక్కులు ఉన్న పురుషులకు దీర్ఘ పురుషాంగం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల 126 మందిపై పరీక్షలు జరిపారు. అయితే వీరు పరీక్షలు చేసింది బతికున్న వారిపై కాదంట.. మరణించిన పురుషులపై పరిశోధన చేశారట. వారు మరణించిన మూడు రోజుల పాటు పరీక్షించారు. చనిపోయిన వ్యక్తికి అంగస్తంభన ఉండదు.
అయితే పరిశోధకులు మృతదేహాల యొక్క పురుషాంగంను సాగదీసి దాని పొడవును పరీక్షించారు. ప్రతి మృతదేహం యొక్క పురుషాంగం ఎత్తు, బరువు, వివిధ శరీర భాగాల పరిమాణం వంటి ఇతర శరీర కొలతలతో పోల్చారు. ఈ వింత ప్రయోగం యొక్క ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. పెద్ద ముక్కు కలిగిన పురుషులలో పురుషాంగం పొడవు పెద్దగా, చిన్న ముక్కులు కలిగిఉన్న మృతదేహాల్లో తక్కువ పొడవు పురుషాంగం కలిగి ఉందని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ అంశంపై పరిశోధనలు పూర్తిస్థాయిలో చేయాల్సి ఉందని, మరికొన్ని పరిశోధనల తరువాత ఈ అంశంపై మరింత స్పష్టత ఇచ్చేందుకు వీలుంటుందని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు.