London, July 17: ఆస్పత్రిలోని ఉచిత వైఫై సాయంతో ఓ ట్రాన్స్‌జెండర్ (Trans Woman) పోర్న్ ప్రపంచాన్ని మొత్తం చూసింది. యూకేలోని ఓ ఆస్పత్రిలోని వైఫై ఉపయోగించుకుని ఏకంగా 80 వేల పోర్న్ చిత్రాలను (child sexual abuse images), వందల వీడియోలను డౌన్‌లోడ్ చేసింది. ఇంకా విచిత్రకర అంశం ఏమిటంటే.. ఆమె ఆ ఆస్పత్రిలో పేషెంట్ గా చేరి ఈ పని చేయడం.. ఈ ఘటన అక్కడ పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది. ప్రియురాలి వీడియోలను పోర్న్ వెబ్‌సైట్లో చూసి ప్రియుడు షాక్, లైబ్రరీకి వెళ్లొస్తానని చెబుతూ మరో కార్యానికి, ఇంటర్నెట్‌లో కుప్పలుతెప్పలుగా వీడియోలు చూసి బేజారైన ప్రియుడు
ఘటన వివరాల్లోకెళితే.. 54 ఏళ్ల జూలీ మార్షాల్ (Julie Marshall) అనే ట్రాన్స్‌జెండర్ 2017 ఆగస్టులో గుండెపోటుతో యూకేలోని ఓ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు బెడ్డును ( Hospital Bed) కేటాయించిన ఆస్పత్రి డాక్టర్లు వాడుకునేందుకు ఉచిత నెట్ సదుపాయాన్ని కల్పించారు. ఇంకేముంది.. బెడ్డుపై పేషెంటు స్థితిలో ఉన్న ఆమె అక్కడ ఉన్న పబ్లిక్ వైఫైను తన ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకుని పోర్న్ ప్రపంచంలో మునిగి తేలింది. ట్రీట్మెంట్ పూర్తయ్యే నాటికి ఆమె 80 వేల వరకు పోర్న్ చిత్రాలు, వందల వీడియోలను ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసింది.
ఇంకా షాక్ ఏంటంటే.. అవన్నీ కూడా పిల్లల పోర్న్ ఫొటోలే కావడం గమనార్హం. అయితే పెద్ద మొత్తంలో ఉండే ఇంటర్నెట్ ప్యాక్ ఎంతో తొందరగా అయిపోవడంతో ఆస్పత్రి వర్గాలు అసలేం జరుగుతోందని ఆరా తీయగా అప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ అసలు రంగు బయటపడింది. ఉన్న నెట్టంతా అసభ్య ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోడానికే ఆమె వినియోగించిందని తేలింది. దీంతో వెంటనే ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. 46% కాలేజీ యువత శృంగార సంబంధ వీడియోలకు బానిస, 10% శాతం మంది అమ్మాయిలకు కౌమార వయసులోనే అబార్షన్స్. ఓ సర్వేలో వెల్లడైన షాకింగ్ విషయాలు
అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె దగ్గర నుంచి ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఆమెపై అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా కుప్పలుగా పడి ఉన్న సీడీలను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా ఆమెకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు పోలీసులకు అసలైన చిక్కొచ్చి పడింది. ట్రాన్స్‌జెండర్‌ను మహిళల జైల్లో ఉంచాలా? లేదా మగవాళ్ల జైల్లో ఉంచాలా? అనేది అర్థమవక తలలు పట్టుకుంటున్నారు. 25 వేల చైల్డ్ పోర్న్ వీడియోలు, గత అయిదు నెలల్లో ఇండియాలో సోషల్ మీడియాలో అప్‌లోడ్, భారత్‌ను అలర్ట్ చేసిన అమెరికా, ఎక్కువగా ఆ అయిదు రాష్ట్రాల్లోనే..
ఈ ట్రాన్స్‌జెండర్ డౌన్లోడ్ చేసిన వాటిల్లో..ఏ గ్రేడ్ చిత్రాలు 677 ఉండగా 465 కేటగిరీ బి చిత్రాలు, 79,958 కేటగిరీ సి చిత్రాలు ఉన్నాయి. అయితే ఆమెకు మానసిక ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయని న్యాయమూర్తి అంటున్నారు. నేను వాటి వివరాలలోకి వెళ్ళను, కాని అవి కౌమారదశ నుండి వయోజన జీవితం వరకు ఆమెన వెంటాడాయని నాకు అనిపిస్తోందని జడ్డి తెలిపారు. ఇక ట్రాన్స్‌జెండర్కు కేటగిరీ ఎ చిత్రాల కోసం మార్షల్‌కు తొమ్మిది నెలలు, బి కేటగిరీ చిత్రాలకు ఆరు నెలలు, కేటగిరీ సి చిత్రాలకు నాలుగు నెలలు జైలు శిక్ష విధించబడింది. లైంగిక నేరస్థుల రిజిస్టర్‌లో సంతకం చేయడానికి ఆమెకు 10 సంవత్సరాల నోటిఫికేషన్ ఉత్తర్వు మరియు ఆరు సంవత్సరాల లైంగిక హాని నివారణ ఉత్తర్వు కూడా ఇవ్వబడింది.